మహబూబ్‌నగర్ అర్బన్, జూలై 5 : గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వే తనాలను వెంటనే చెల్లించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రాములు, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు దేవదానం, కార్యదర్శి సాంబశివుడు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 13వేల గ్రామపంచాయతీల్లో కార్మికులుగా పనిచేస్తున్నారని, వారికి ప్రతి నెలా రావాల్సిన జీతం నెలల తరబడి అందడంలేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యపు వైఖరితో కార్మికుల బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీపీ సిబ్బంది వేతనాల కోసం ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్‌ను ఏర్పాటు చే యాలని, జనాభా ప్రాతిపదికన కార్మికుల సంఖ్యను పెం చాలన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ గ్రాట్యుటీ కల్పిస్తూ జీ వో 60 ప్రకారం వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జీపీ కార్మికులు ఉన్నారు.