మాగనూరు : ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను (Pending Bills) వెంటనే క్లియర్ చేయాలని టీఎస్ యూటీఎఫ్ ( TS UTF ) జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి కోరారు. నారాయణపేట జిల్లా పరిధిలోని మాగనూరు మండలంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు మెరుగైన హెల్త్ స్కీమ్‌ను ప్రకటించాలని కోరారు. ఈ సభ్యత్వ నమోదులో మాగనూరు మండల అధ్యక్షులు రాఘవేంద్ర చారి, మండల ప్రధాన కార్యదర్శి నగేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు శంకర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.