కోస్గి(గుండుమాల్), జూలై 20 : రేవంత్ పాలన చేతకాకపోతే పదవి నుంచి దిగిపోవాలని.. నీ వల్ల విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన గుండుమాల్ మండల కేంద్రంలో ని మోడల్ స్కూల్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకోగా వారు అన్నంలో పురుగులు వస్తున్నాయని, హాస్టల్లో వి ద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు వాష్‌రూంలు లేవని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన అక్కడ ఉన్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభు త్వం పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు విద్యారంగాన్ని ఉన్నత స్థాయిలో ఉంచితే ఇప్పుడు సీఎం విద్యాశాఖ మంత్రి గా ఉండి తన నియోజకవర్గం లోనే పాఠశాలలనే నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
నేడు కొడంగల్ నియోజకవర్గానికి వస్తున్న రేవంత్‌ను నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశా రో ప్రజలకు చెప్పాలన్నారు. లగచర్ల రైతులను మోసం చేశానని చెప్తావా?, నీ సోదరుడి అండదండలతో ఇసుక మాఫియాను నడిపిస్తూ కోట్లు దండుకుంటున్నామని చెప్తావా? లేదా పాఠశాలలను మూసి వేసి విద్యా వ్యస్థను నిర్వీర్యం చేశానని చెప్పడానికి కొడంగల్‌కు వచ్చానని చెప్తావా? అని ప్రశ్నించారు. అంతకుముందే పాఠశాలను తనిఖీ చేయడానికి వచ్చిన ఏడీ శ్రీనివాస్‌రెడ్డితో మాట్లాడారు. పాఠశాలలను పట్టించుకోకుండా గాలికి వదిలేశారా అని ప్రశ్నించారు. సీఎం నియోజకవర్గంలో విద్యాశాఖ మంత్రి జిల్లాలోనే పాఠశాలల పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఎలా ఉందో ఈ దృశ్యం అద్దపడుతోందని అన్నారు. ఏడాది నుంచి విద్యార్థులకు ఎందుకని నాన్ వెజ్ అందించడం లేదని ప్రశ్నించగా సిబ్బంది సరైన సమాధానం ఇవ్వకపోవడంతో వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. బాలికల హాస్టల్లోకి మగవాళ్లను ఎం దుకు రానిస్తున్నారని వార్డెన్‌ను ప్రశ్నించగా ఆమె సమాధానాన్ని దాట వేశారు.
పాఠశాల, హాస్టల్లో నెలకొన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకుపోయి మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఏడీకి సూచించారు. అయితే మాజీ ఎమ్మెల్యే హాస్టల్లోని వెళ్లి పరిశీలిస్తాం అనగానే సిబ్బంది గేటు తెరవకపోవడబంతో వీరారం మాజీ సర్పంచ్ తిరుపతి, మాజీ జెడ్పీటీసీ మహిపాల్ తదితరులు హాస్టల్ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ తప్పులను దాచి పెట్టడానికి మమ్మ ల్ని లోపలికి రానివ్వరా అంటూ ప్రశ్నించారు. బాలికల హాస్టల్ అన్న విష యం తమకు తెలుసు అని, వారం తా పాఠశాలలో ఉన్నప్పుడు గదు లు చూపించడానికి మీకు ఇబ్బంది ఎందుకని వారి తీరు పై ఆగ్రహం వ్యక్తం చేయగా ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడడంతో మాజీ ఎమ్మెల్యేతోపాటు నలుగురిని లోపలికి పం పించారు. అనంతరం అక్కడే ఉన్న మీడియాను కూడా హా స్టల్ సిబ్బంది లోపలికి అనుమతించక పోవడంతో మీడియా ప్రతినిధులు వారి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.