కోసి, ఏప్రిల్ 23 : వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలుదాం.. కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. బుధవారం గుండుమాల్ మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ముందుగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మా ట్లాడుతూ కేసీఆర్ ఆధ్వర్యంలో స్వరాష్ట్ర సాధన కోసం 14 ఏండ్ల పాటు అలు పెరుగని పోరాటం చేసిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు.
స్వరాష్ట్రం ఏర్పడిన అనంతరం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపి దేశానికే రోల్ మోడల్‌గా నిలిపారని గుర్తు చేశారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు దిశానిర్దేశం చేస్తే అవకాశం ఉన్నందున మండలం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో కోస్గి, గుండుమాల్ మండలాలకు చెందిన మండల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
రేవల్లి, ఏప్రిల్ 23 : వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వనపర్తి జిల్లా నుంచి భారీగా తరలివెళ్దామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మండలకేంద్రంలో కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించా రు. ముందుగా కార్యక్రమానికి సం బంధించిన పోస్టర్‌ను మండల నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ సభకు వనపర్తి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని, అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేశామన్నారు.
వరంగల్‌కు తరలివెళ్లే కార్యకర్తల కోసం అక్కడక్కడ భోజనాలు కూడా సిద్ధం చేశామని ఆయన వివరించారు. కార్యక్రమంలో జిల్లా గొర్రెల కాపరుల సంఘం మాజీ అధ్యక్షులు కురుమూర్తియాదవ్, మార్ఫెఫెడ్ స్టేట్ డైరెక్టర్ విజయకుమార్, మాజీ ఎంపీపీ బంకల సేనాపతి, మాజీ వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీ శ్రీశైలంయాదవ్, మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండీ ఖాజా, నాయకులు శివరాంరెడ్డి, కృష్ణారెడ్డి, వెంకటస్వామి, బాలస్వామి, కురుమయ్య, కృష్ణయ్య, రాంచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లాలో జరిగే బీఆర్ఎస్ సభను సక్సె స్ చేయడానికి పార్టీశ్రేణులు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అచ్చంపేట ని యోజకవర్గ యూత్ అధ్యక్షుడు కొర్ర వంశీనాయ క్, పార్టీ నాయకులు ఆధ్వర్యంలో చేదురుబావి తండా, కొర్ర తండా, దుబ్బతండా, ఐనోల్, శివా రు తండా, కాన్యతండా, సింగారం పెద్ద తండాలో ఉపాధి కూలీలతో కలిసి సభ పోస్టర్లను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ సభకు స్వచ్ఛందంగా తరలివెళ్తామని చెప్పారు.
– అచ్చంపేట టౌన్, ఏప్రిల్ 23