ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, వికారాబాద్ జిల్లాల్లోని 12 లక్షల ఎకరాలకు సాగునీరం దించేందుకు ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టింది. పీఆర్ఎల్ఐ కింద రిజర్వాయర్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూలై చివరి నాటికి రిజర్వాయర్లను నింపాలని సీఎం కేసీఆర్ ఇటీవల ఆదేశిం చడంతో సబ్‌స్టేషన్, పంప్‌హౌస్, కాల్వల పనుల్లో వేగంపెరిగింది. నార్లాపూర్ వద్ద పంప్‌హౌస్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఎల్లూరు రిజర్వాయర్ నుంచి నార్లాపూర్ జలాశయానికి గ్రావిటీ ద్వారా నీటిని తరలించనున్నారు. అక్కడి నుంచి ఏదుల రిజర్వాయర్‌కు కాల్వల ద్వారా నీటిని చేరవేయనున్నారు. ఈ ప్రక్రియ అంతా జూలై వరకు పూర్తి కానున్నది. ఆగస్టులో ఏదుల నుంచి వట్టెం.. అక్కడి నుంచి కరివెనకు కృష్ణమ్మ పరుగులు పెట్టనున్నది. సెప్టెంబర్ చివరి నాటికి ఉదండాపూర్ రిజర్వాయర్‌కు సాగునీరందనున్నది. పీఆర్ఎల్ఐ కింద మిగిలిపోయిన భూ సేకరణను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
మహబూబ్‌నగర్, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు ఎత్తిపోతల ప థకం పనులు శరవేగంగా సాగుతున్నా యి. రిజర్వాయర్లు, కాలువలు, టన్నెళ్లు, పంప్‌హౌస్‌ల నిర్మాణంలో మిగిలిపోయి న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చే స్తున్నారు. కొత్త సచివాలయం ప్రారంభించాక సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై ఉన్నతస్థాయి స మీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేయడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతూ పనుల ను పూర్తి చేయిస్తున్నారు. సమీక్షా సమావేశంలో ఉమ్మడిజిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఇరిగేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పనుల పురోగతిపై సమీక్షించిన సీఎం జూలై చివరి వరకు రిజర్వాయర్లను నింపాల ని ఆదేశించడంతో.. ఇరిగేషన్ ఉన్నతాధికారులు పా లమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై ఫోకస్ పెట్టారు. పీఆర్ఎల్ఐలో ఐదు రిజర్వాయర్లు ఉండగా.. అం దులో రెండు పూర్తికాగా మరో రెండింటి పనులు పు రోగతిలో ఉన్నాయి. మరో రిజర్వాయర్ నిర్మాణం జరుగుతున్నది.
ఈ రిజర్వాయర్లకు నీళ్లను తరలించే కన్వేయర్ సిస్టంలో భాగంగా టన్నెళ్లు పూర్తికాగా కా లువలు, ఎలక్ట్రిసిటీతోపాటు చిన్నచిన్న పనులు చేస్తున్నారు. ఎత్తిపోతల పథకంలో భాగంగా మొత్తం 18 ప్యాకేజీల్లో పనులు నడుస్తుండగా.. స్టేజ్-1, స్టేజ్-2గా విభజించి పనులను ఆయా కాంట్రాక్టర్లకు అ ప్పగించారు. స్టేజ్-1లో పనులు దాదాపు పూర్తి కా గా.. స్టేజ్-2లో పనులు మిగిలి ఉన్నాయి. సీఎం స మీక్షించిన వారానికి మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వం లో సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్, జిల్లాకు చెం దిన ఎమ్మెల్యేల బృందం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులన్నింటినీ ము ఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన గడువులోగా పూర్తి చేయాలని సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో నార్లాపూర్, ఏ దుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల పనులు ఊపందుకున్నాయి. పీఆర్ఎల్ఐ కింద మి గిలిపోయిన భూసేకరణ పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లను మంత్రి సింగిరెడ్డి ఆదేశించారు.
కొనసాగుతున్న ఎలక్ట్రిఫికేషన్ పనులు
పీఆర్ఎల్లో రిజర్వాయర్లకు నీటిని తరలించేందు కుగానూ ప్రధాన టన్నె ళ్ల నిర్మాణం పూర్తయినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఎల్లూరు నుంచి నార్లాపూర్ వ రకు 15 కిలోమీటర్ల టన్నెల్తోపాటు.. ఏదుల నుం చి వట్టెం వరకు 19కిలోమీటర్ల టన్నెల్ పనులు కూ డా పూర్తిచేశారు. అక్కడి నుంచి కరివెన వరకు గ్రావి టీ.. కర్వేన నుంచి ఉదండాపూర్ వరకు గ్రావిటీ, ట న్నెల్ ద్వారా నీటిని తరలించే ప్రక్రియ తుదిదశకు చేరుకోగా.. సబ్‌స్టేషన్ పనులు నడుస్తున్నాయి. కా గా మొత్తం నాలుగు పంప్‌హౌస్‌ల్లో పంపుల బిగిం పు ప్రక్రియ కొనసాగుతుండగా.. హైటెన్షన్ విద్యుత్ వైర్లను లాగుతున్నారు. కాలువల నిర్మాణం ఉపందుకోగా.. రిజర్వాయర్ టు రిజర్వాయర్ మధ్య నీటి ని పంపించే ప్రక్రియపై అధికారులు దృష్టి సారించా రు. నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్లు పూర్తికాగా.. వట్టెం, కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్లలో మిగిలిన పనులు చేపడుతున్నారు.
12క్షల ఎకరాలకు సాగునీరు..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను శ్రీశైలం బ్యా క్వాటర్‌ను ఎత్తిపోసేలా నిర్మిస్తున్నారు. 90 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తూ మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, వికారాబాద్ జిల్లాలోని 12లక్షల ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజె క్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను ఎల్లూరు రిజర్వాయర్ నుంచి గ్రావిటీ కె నాల్ ద్వారా నార్లాపూర్ రిజర్వాయర్(6.5 టీఎంసీలు)కు తరలించి నిల్వ చేస్తారు. అక్కడి నుంచి ఏ దుల రిజర్వాయర్(సామర్థ్యం 6.5టీఎంసీలు)కు, అక్కడి నుంచి వట్టెం రిజర్వాయర్‌కు (సామర్థ్యం 16 టీఎంసీలు) తరలిస్తారు. వట్టెం నుంచి కరివెన రిజర్వాయర్‌కు (సామర్థ్యం 19 టీఎంసీలు).. ఇక్కడి నుంచి ఉదండాపూర్(సామర్థ్యం 16టీఎంల సీలు)కు తరలిస్తారు. ఉదండాపూర్ నుంచి కాలువ ల ద్వారా నారాయణపేట, కోయిల్‌సాగర్ వరకు సా గునీటిని తరలిస్తారు. ఇక్కడి నుంచి అవసరమైతే భీ మా ప్రాజెక్ట్‌కు రివర్స్ కనెక్టివిటీ ఇచ్చి జూరాలకు రివర్స్‌గా శ్రీశైలం జలాలను పంపి నింపాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది. దీనివల్ల భవిష్యత్‌లో నీటిఎద్దడి లేకుండా సాగు, తా గునీటికి ఢోకా ఉండదని ప్రభుత్వం యోచిస్తున్నది.
ఆర్అండ్ఆర్ సెంటర్ల ఏర్పాటు
పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా భూ ములు కోల్పోయిన వారికి పరిహారం అందించే పక్రియ దాదాపు పూర్తయింది. కొన్నిచోట్ల వంద ఎకరాల లోపు భూమి సేకరించాల్సి ఉంది. మిగిలిపోయిన భూములను వెంటనే సేకరించాలని, నష్టపోయిన రైతులకు పరిహారం వెంటనే అందించాలని నాగర్‌కర్నూల్, పాలమూరు కలెక్టర్లను గత సమీక్షలో మంత్రి ఆదేశించారు. జడ్చర్ల మండ లం ఉదండాపూర్ వద్ద రిజర్వాయర్ నిర్మాణంలో ని ర్వాసితులైన కుటుంబాలకు రిహ్యాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. నిర్వాసితులను గుర్తించే ప్రక్రియ కూడా పూర్తి కాగా.. త్వరలో ఆర్అండ్ఆర్ సెంటర్‌ను ఏర్పాటు చేసి పునరావాసం కల్పించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
జూలై నాటికి పాలమూరు నీళ్లు
పాలమూరు ఎత్తిపోతల కింద నిర్మించిన రిజర్వాయర్లను జూలైలో నింపేందుకు అన్నివిధాలా పనులు చేపట్టారు. జూన్ చివరి నాటి కి లేదా జూలైలో సాగునీటిని నింపాలని సీఎం ఆదేశించడంతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్లను మొదటిదశలో పూర్తిస్థాయిలో నింపుతామంటున్నారు. ఆగస్టులో వట్టెం, కరివెన రిజర్వాయర్లను.. సెప్టెంబర్ చివరి నాటికి ఉదండాపూర్ రిజర్వాయర్‌ను నింపి సాగు, తాగునీటి అవసరాలను తీరుస్తామంటున్నారు. ఇటీవలే సుప్రీంకోర్టు తాగునీటి అవసరాలకు పను లు చేసుకోవచ్చని అనుమతివ్వడంతో ప్రభుత్వం ఈ వానకాలాన్ని పూ ర్తిస్థాయిలో వినియోగించి రిజర్వాయర్లను నింపాలని యోచిస్తోం ది. అధికారులు సీఎం ఆదేశాలతో టైం బాండ్ ప్రకారం నీళ్ల విడుదల పక్రియ సాగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా స్వరూపమే మారిపోతది
పీఆర్ఎల్ ఎత్తిపోతల పథకం పూర్తికావొచ్చింది. సీ ఎం కేసీఆర్ ఆదేశించిన విధంగా జూన్, జూలై నుంచే రిజర్వాయర్లను నింపే ప్రక్రియ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ నాటికి ఐదు రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నింపుతాం. సాగు, తాగునీటికి ఢోకా ఉండదు. రిజర్వాయర్లు నిండి కాల్వల్లో నీళ్లు పారితే భూగర్భ జలాలు పెరగడంతోపాటు పాలమూరు జిల్లా స్వరూపమే మారిపోతుంది. పాలమూరు పచ్చబడటమే కాక.. కరువు, వలసల జిల్లా పేరు తుడిచిపెట్టుకుపోతుంది.
– లక్ష్మారెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే