మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూన్ 23 : పాలమూరు విశ్వవిద్యాలయంలో చేరిన విద్యార్థి ఉద్యోగంతో లేదా ఏదైనా కంపెనీ వ్యవస్థాపకుడిగా బయటకు వెళ్లాలన్నదే మా లక్ష్యం. ఆ దిశగా విద్యార్థులకు నైపుణ్యశిక్షణలతోపాటు వారి ఆలోచనలను గుర్తించి ప్రోత్సహిస్తున్నాం. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతున్నామంటున్నారు.. పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ జీఎన్.శ్రీనివాస్. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ముఖాముఖి మాట్లాడా రు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యు వతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ఆధునిక సాం కేతిక పరిజ్ఞానం అందించడంతోపాటు విద్యార్థులు, అధ్యాపకులకు విస్తృతస్థాయి పరిశోధనలకు ఊతం ఇవ్వనున్నామని తెలిపారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
మొదటి ఏడాది నుంచే నైపుణ్య శిక్షణలు..
డిగ్రీ, పీజీ, యూనివర్సిటీ విద్యార్థులకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించే సిలబస్‌తోపాటు తొలి ఏడాది నుంచే నైపుణ్య శిక్షణలు అందించనున్నాం. విద్యార్థుల్లో ఉన్న విభిన్న ప్రతిభా పాటవాలను గుర్తించి ఎదగడానికి అవసరమైన సహకారాన్ని అందిస్తాం. పోటీ పరీక్షలతో పాటు పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలతోపా టు సాప్ట్ స్కిల్స్, సబ్జెక్ట్ స్కిల్స్ నేర్పించేలా కార్యాచరణ రూపొందించాం. వినూత్న ఆవిష్కరణలు చేసే విద్యార్థులకు మార్గదర్శకత్వం చేయడం, ఉత్పత్తి చేసే స్థాయికి తీసుకెళ్లేందుకు అవసరమైన ఆర్థిక, ఇతర సహకారాన్ని అందించనున్నాం.
విడుతల వారీగా..
డిపార్ట్‌మెంట్‌ల్లో ఉండే విద్యార్థుల నైపుణ్యాలపై ఒక అవగాహనకు వచ్చిన తర్వాత వారికి అందించాల్సిన శిక్షణ వివరాలను సంబంధిత విభాగాధిపతులు, అధికారుల ద్వారా సేకరిస్తాం. విద్యార్థులకు విభాగాలు, విడుతల వారీగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తాం. నైపుణ్య శిక్షణ ఇ ప్పించేందుకు పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకోబోతున్నాం. ఇప్పటికే కొన్ని కీలక సంస్థలతో ఎం వోయూలు చేసుకున్నాం. భవిష్యత్‌లో ప్రము ఖ సంస్థలు, పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకోను న్నాం. మారుతున్న కాలానికి అనుగుణంగా ఫ్యాకల్టీలోనూ మార్పులు తీసుకొచ్చేందుకు లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లకు ఆధునిక సాంకేతికత, కొత్త బోధనా పద్దతులు, ఏఐ టూల్స్ మీద ట్రైనింగ్, పరిశ్రమల నుంచి నిపుణులను పిలిపించి మాస్టర్ క్లాస్‌ని ఇప్పించేందుకు చర్యలు చేపడుతున్నాం.
శోధన.. పరిశోధనలు.. ఆదాయం ..
నూతనంగా యూనివర్సిటీలో రీసెర్చ్ ఫెసిలిటీ బిల్డింగ్ నిర్మాణం పూర్తయింది. మాలిక సదుపాయాలు కల్పించే పనులు కొనసాగుతున్నాయి. పరిశోధన పరికరాల ఏర్పాటు ప్రక్రియతో మూడునెలల్లో అందుబాటులో రానున్నది. దీనిద్వారా వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించి సహకారాన్ని అందించనున్నాం. మరికొన్ని అత్యాధునిక ల్యాబ్‌లు ఈ పరిశోధన కేంద్రంలో అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ విద్యార్థులకు అవసరమైన సహకారాన్ని అందిస్తాయి. విద్యార్థులను నైపుణ్యాలను మెరుగుపర్చడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచే ఉద్దేశంతోనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరిశోధన కేంద్రం అందుబాటులోకి తీసుకురానున్నాం. రీసెర్చ్ బిల్డిండ్లోని ల్యాబ్‌లను పరిశ్రమలు, ఇత ర సంస్థలు సైతం మన వద్దకు వచ్చి ప్రయోగాలు చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాం. కన్సల్టెన్సీ ద్వారా విశ్వవిద్యాలయానికి అదనపు ఆదా యం సైతం సమకూరనున్నది.
గతానికి భిన్నంగా..
పీయూలో గతంలో కొంద రు సిబ్బంది సంతకాలు పెట్టి బయటకు వెళ్లేవారనే అపవాదు ఉం డే.. దాన్ని పూర్తిస్థాయిలో వం దశాతం నియంత్రించాం. వర్సిటీలోని అన్ని విభాగాలను సక్రమమార్గంలో నడిపించేందుకు ప్రిన్సిపాళ్లు, విభాగాధిపతులు, బోధన, బోధనేతర ఉ ద్యోగులందరితో సమన్వయంతో సమిష్టిగా ముం దుకు సాగుతున్నాం. ఎవరైనా సిబ్బంది నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్య లు తీసుకునేందుకు వెనుకాడేది లేదు. పరిపాలన పరమైన అంశాల్లో నాతోపాటు ప్రతిఒక్కరూ త మ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సిందే. విద్యార్థులకు నూతనంగా వసతి గృహల నిర్మాణాలు, లా, ఇంజినీరింగ్ కళాశాలల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వాటి నిర్మాణం పూర్తయితే సకల సౌకర్యాలకు నిలయంగా పాలమూరు మారనున్నది.
ప్రగతి దిశగా పాలమూరు..
విశ్వవిద్యాలయం ప్రగతి దిశగా పయనిస్తోంది. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలతో పోటీపడు తూ తన మార్కును చూపుతోంది. నిధుల సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూనే శక్తికి మించి పనిచేస్తున్నాం. బోధన, పరిశోధనల్లో ఇప్పటికే జాతీయస్థాయి గుర్తింపు అందుకున్నాం. రా నున్న రోజుల్లో ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థ ల్లో పాలమూరు విద్యార్థులు ఉండాలనేదే మా కల.. అందరం కష్టపడుతూ విశ్వ విద్యాలయాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషిచేస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం మరింత ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం.