పల్లె ముంగిట డిజిటల్ సేవలు
ప్రజలకు వేగంగా, పారదర్శకంగా సేవలందించేందుకుగానూ ప్రభుత్వం సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నది. ఈ క్రమంలో డిజిటల్ సే వలను పల్లెముంగిట్లోకి తీసుకొస్తున్నది.
- త్వరలో గ్రామాల్లో ఆన్లైన్ విధానం అమలు
- ఊళ్లల్లోనే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అందేలా చర్యలు
- పంచాయతీ కార్యదర్శులకు డిజిటల్ కీ
వనపర్తి, నవంబర్ 24 (నమస్తే తెలంగా ణ) : ప్రజలకు వేగంగా, పారదర్శకంగా సేవలందించేందుకుగానూ ప్రభుత్వం సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నది. ఈ క్రమంలో డిజిటల్ సేవలను పల్లెముంగిట్లోకి తీసుకొస్తున్నది. గ తంలో మాదిరిగా పనుల కోసం గ్రామస్తులు మండల, జిల్లా కేంద్రాలకు తిరిగే ఇబ్బందులు లేకుండా.. గ్రామ పంచాయతీల ద్వారానే సేవలందించే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నది. పల్లెల్లోనే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను డిజిటల్ సంతకంతో అందించేలా.. పంచాయతీ కార్యదర్శులకు డిజిటల్ కీ అందించారు.
వనపర్తి జిల్లాలోని 255 గ్రామపంచాయతీల్లో ఈ ప్రక్రియను పూర్తిచేశారు. పంచాయతీల్లో పారిశుధ్యం, ఇం టి పన్నుల వసూళ్లు, హరితహారం, నర్సరీల ని ర్వహణ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీతోపాటు గ్రామ సభల నిర్వహణ, ఉపాధిహామీ పనులు వంటి తదితర 34 రకాల పను లు కార్యదర్శులు నిర్వహిస్తుంటారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
సర్టిఫికెట్ల కోసం పంచాయతీ కార్యదర్శుల సంతకాలు ఫోర్జరీ చేయడం, మరికొన్ని చోట్ల కార్యదర్శులే తప్పుడు ధ్రువీకరణ పత్రాలు జారీచేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టాలని డిజిటల్ కీ విధానాన్ని తీసుకొచ్చింది. ఇకనుంచి ఫోర్జరీకి అవకాశం లేకుండా జనన, మరణ ధ్రువీకరణపత్రాలు అందనున్నాయి. ఆన్లైన్లో ఐప్లె చేసుకున్న వెంటనే అందులో నమోదు చేసిన ఫోన్ నెంబర్కు దరఖాస్తునెంబర్ వస్తుంది. పత్రం సిద్ధం కాగానే దరఖాస్తుదారుడి నెంబర్కు సమాచారం అందుతుంది. ఇలా డిజిటల్ సంతకంతో కూడిన పత్రాన్ని మీ సేవా సెంటర్ లేదా పంచాయతీ కార్యాలయానికి వెళ్లి ప్రింట్ తీసుకోవచ్చు. డిజిటల్ కీ కోసం కార్యదర్శులు ఈ-ముద్ర వెబ్సైట్లోకి వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నారు. ఆధార్, పాన్కార్డు వివరాలను పొందుపరుచడంలోపాటు సంతకం అప్లోడ్ చేస్తున్నారు.
జిల్లాలో పూర్తయిన ప్రక్రియ..
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో డిజిటల్ కీ ప్రక్రియ పూర్తయ్యింది. భవిష్యత్తులో గ్రామ పంచాయతీ పరిధిలో డిజిటల్ ధ్రువపత్రాలను అందజేస్తారు. జనన, మరణ ధ్రువపత్రాలకు సంబంధించిన ప్రోగ్రామింగ్ పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొ స్తాం. ప్రస్తుతం చేతిరాతతో పత్రాలు అందజే స్తుండగా.., ఇకపై డిజిటల్ సంతకాలతోనే పత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది. భవిష్యత్లో మరిన్ని సేవలు ఆన్లైన్ పరిధిలోకి రానున్నాయి. ఇందుకోసం ప్రతి కార్యదర్శికి
డిజిటల్ కీని అందజేస్తున్నాం.
– సురేశ్, డీపీవో, వనపర్తి
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

