Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
Hyderabad | హైదరాబాద్‌లో తాగునీటి దుర్వినియోగంపై జలమండలి చర్యలు చేపట్టింది. జూబ్లీహిల్స్‌లోని ఫోర్ ఫాదర్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా విధించి, తాగునీటి కనెక్షన్‌తో పాటు కమర్షియల్ వాటర్ ట్యాంకర్ల సరఫరాను నిలిపివేసింది.
Hyderabad | తాగునీటిని దుర్వినియోగం చేస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవని హైదరాబాద్ జలమండలి స్పష్టం చేసింది. నీటి వృథాపై అందిన ఫిర్యాదుతో జూబ్లీహిల్స్‌లోని ఫోర్ ఫాదర్స్ పబ్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి రూ.20 వేల జరిమానా విధించడంతో పాటు తాగునీటి కనెక్షన్‌ను తొలగించారు. కమర్షియల్ వాటర్ ట్యాంకర్ల ద్వారా అందించే నీటి సరఫరాను కూడా నిలిపివేశారు.
జూబ్లీహిల్స్ సర్కిల్ పరిధిలోని రోడ్ నంబర్ 45, ప్లాట్ నంబర్ 872లో ఉన్న ఫోర్ ఫాదర్స్ పబ్‌లో నీటి దుర్వినియోగం జరుగుతున్నట్లు జలమండలికి ఫిర్యాదు అందింది. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. నీటి దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించడంతో పబ్ యాజమాన్యంపై చర్యలు తీసుకున్నారు. జరిమానాతో పాటు తాగునీటి కనెక్షన్‌ను తొలగించి, కమర్షియల్ వాటర్ ట్యాంకర్ల సరఫరాను నిలిపివేశారు.
వేసవిలో తాగునీటి అవసరాలు పెరిగే అవకాశం ఉండటంతో ప్రతి నీటి చుక్కనూ పొదుపుగా వినియోగించాలని జలమండలి ప్రజలకు సూచించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, ఇతర వాణిజ్య సంస్థలు తాగునీటిని వృథా చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని కోరింది. నీటి దుర్వినియోగాన్ని ఉపేక్షించబోమని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు కనెక్షన్ల తొలగింపు వంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నగరంలో ఎక్కడైనా తాగునీటి వృథా లేదా దుర్వినియోగం కనిపిస్తే ప్రజలు జలమండలికి వాట్సాప్: 99499 30003, కస్టమర్ కేర్: 155313 నంబర్ల ద్వారా సమాచారం అందించాలని అధికారులు కోరారు.
ఫిర్యాదుతో పాటు ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, వ్యక్తులు లేదా సంస్థల వివరాలు, ప్రాంతం, పూర్తి చిరునామాను పంపించాలని సూచించారు. అందిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, ఉల్లంఘనలు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని జలమండలి హామీ ఇచ్చింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

