వంగూరు, జనవరి 14 : మండలంలోని వి విధ గ్రామాల్లో ఆదివారం ప్రజలు భోగి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో ప్రధాన కూడలితో పా టు ఇండ్ల వద్ద భోగీ మంటలను ప్రజలు కాపుకొన్నారు. అనంతరం భోగి స్నానాలు చేసి పా లను పొంగించారు.
కల్వకుర్తి, జనవరి 14 : మండలంలో భోగి పండుగను ఘనంగా జరుపుకొన్నారు. యూత్‌ఫర్ సేవా ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆడపడుచులు ఇండ్ల ముందు సంక్రాంతి ముగ్గు లు వేశారు. ముత్యా ల ముగ్గుల మధ్య భోగి మంటలు వేసి ఆహ్లాదకరంగా దాండియా ఆటలు ఆడారు. కార్యక్రమంలో డీఎస్పీ పార్థసారధి, మున్సిపల్ చైర్మన్ ఎడ్మసత్యం, మాజీ సర్పంచ్ ఆనంద్‌కుమార్ పాల్గొన్నారు.
అమ్రాబాద్, జనవరి 14: అమ్రాబాద్, పదర ఉమ్మడి మండలాల్లోని ప్రజలు మూడు రోజుల సంక్రాంతి సంబరాల్లో భాగంగా మొద టి రోజు భోగి పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళలు ఇంటి ముంగిళ్లలో భోగి మంటలను, రంగవల్లులు వేశారు.
నాగర్‌కర్నూల్‌టౌన్, జనవరి 14 : నాగర్‌కర్నూల్‌లో ఆదివారం సంక్రాంతి పండుగ సం బురాలను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. పట్టణంలోని పలుకాలనీల్లో భోగి మంటల్లో పాత వస్తువులను వేసి ఆట, పాటలతో మహిళలు బొడ్డెమ్మ వేశారు.
పెద్దకొత్తపల్లి, జనవరి 14: మండల పరిధిలోని పెద్దకారుపాములలో సంక్రాంతి పండుగను పురస్కరంచుకొని గ్రామ శ్రీనివాస ఫొటోస్టూడియో ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ బహుమతులు సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, విష్ణు అందజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎల్లయ్య, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.
అచ్చంపేట/అచ్చంపేట రూరల్/అచ్చంపేటటౌన్ జనవరి 14: నియోజకవర్గంలో ప్రజలు బోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. చిన్నా పెద్దా అంతా కోలాటాలు, ఆటపాటలతో సందడి చేశారు. మహిళలు ఇండ్లముందు రంగురంగుల ముగ్గులు వేశారు. ఐద్వా ఆధ్వర్యంలో ఆదివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు.