బాలానగర్ (రాజాపూర్), మే 4 : ప్రియురాలు మరణించిందన్న క్షణికావేశంలో ప్రియుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన రాజాపూర్ మండలంలో ఆదివారం చోటుచేసుకున్నది. వయసు తేడా కారణంగా పెద్దలు వద్దన్నారని యువతి ఆత్మహత్యకు పా ల్పడగా, ఆ విషాదాన్ని తట్టుకోలేని ప్రియుడు సైతం ఆ త్మహత్యకు పాల్పడ్డాడు. చిన్నరేవల్లి గ్రామానికి చెం దిన వర్షిత(18), అదే గ్రామానికి చెందిన శివప్రసాద్ (17) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరి ప్రేమకు వయసులో తేడా అడ్డుగా మారింది. వీరి ప్రేమ వ్యవహా రం తెలిసిన ఇరు కుటుంబాల పెద్దలు వయసు తేడా ను చూపించి పెళ్లికి అభ్యంతరం చెప్పారు.
ఈ క్రమంలోనే రెండు నెలల కిందట పంచాయితీ పెట్టి సర్దిచెప్పారు. కొద్ది రోజులు గడచిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దామని చెప్పారు. అయితే తమ ప్రేమకథ ముందు కు సాగేలా లేదని నిర్ధారించుకున్న వర్షిత ఆదివారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. వర్షిత మరణవార్త విన్న శివప్రసాద్ అదేరోజు మధ్యాహ్నం ఇంట్లోంచి వెళ్లి మొదంపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
బిజినేపల్లి, మే 4 : వడదెబ్బతో మహిళ మృతిచెందిన ఘటన మంగనూర్లో ఆదివారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. రేణుక(34) గురువారం వ్యవసాయ పనులకు పొ లానికి వెళ్లింది. ఎండ తీవ్రతకు వాంతులు, విరేచనాలయ్యాయి. స్థానికులు నాగర్కర్నూల్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి భర్తతోపాటు ఇద్దరు సంతానం ఉన్నారు.