హరితహారానికి సర్వం సిద్ధం
తొమ్మిదోవిడుత హరితహారం కార్యక్రమానికి అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది సన్నద్ధమవుతున్నారు. మూడునెలల నుంచి నర్సరీల్లో పెం చుతున్న మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగి పంపిణీకి సిద్ధమయ్యాయి. వర్షాలు పుష్కలంగా కురిసిన వెంటనే మొక్కలు నాటేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.
- 4లక్షల 90వేల మొక్కలు నాటడమే లక్ష్యం
- నర్సరీల్లో పంపిణీకి సిద్ధంగా ఉన్న మొక్కలు
- మండలంలో కొనసాగుతున్న గుంతల తవ్వకాలు
నవాబ్‌పేట, జూలై 2 : తొమ్మిదోవిడుత హరితహారం కార్యక్రమానికి అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది సన్నద్ధమవుతున్నారు. మూడునెలల నుంచి నర్సరీల్లో పెం చుతున్న మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగి పంపిణీకి సిద్ధమయ్యాయి. వర్షాలు పుష్కలంగా కురిసిన వెంటనే మొక్కలు నాటేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. మొక్కలు నాటేందుకుగానూ ఇప్పటికే గుం తలు తవ్వే పనులను ప్రారంభించారు. న వాబ్పేట మండలంలోని 54 గ్రామపంచాయతీల్లోని ఉపాధి హామీ పథకం నర్సరీల్లో మొక్కలను పెంచి పంపిణీకి సిద్ధం చేశారు.
ఈ ఏడాది 4లక్షల 90వేల మొక్కలు నాటి పెంచాలని ఉన్నతాధికారులు లక్ష్యం విధించారు. ఆయా నర్సరీల్లో టేకు, కానుగ, వేప, మునగ, ఈత, సీతాఫలం, చింత, గులాబీ, చామంతి, తులసి మొక్కలు పెంచారు. వర్షాలు కురిసిన వెంటనే ఆయా గ్రామాల్లో నిర్దేశిత స్థలాల్లో మొక్కలు నాటడంతోపా టు, రైతులకు సైతం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మండలంలోని పలు గ్రామాల్లో 72వేల గుంతలు తవ్వి మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉం చారు. ప్రభుత్వం విధించిన లక్ష్యం చేరుకునే విధంగా అధికారులు మొక్కలు నాటేందుకు సమాయత్తమవుతున్నారు. కమ్యూనిటీ హరితవనాలు పెంచేందుకు అనువైన ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేయడంతోపాటు ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో పెద్దఎత్తున మొక్కలు నాటి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
కమ్యూనిటీ హరితవనాలకు ప్రాధాన్యం
తొమ్మిదో విడుత హరితహారంలో కమ్యూనిటీ హరితవనాలు పెంచేందుకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నాం. ఇప్పటికే ఇందుకు అనువైన పొలాలను ఎంపిక చేశాం. అదేవిధంగా చెరువు గట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆలయాలు, పాఠశాలల్లో మొక్కలు నాటేలా ఉపాధి హామీ సిబ్బంది, కూలీలను సిద్ధం చేశాం. రైతులకు ఎవరికైనా మొక్కలు అవసరమైతే ఆధార్ కార్డుతో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌ను సంప్రదించాలి.
– జ్యోతి, ఏపీవో, నవాబ్‌పేట
లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు
ప్రభుత్వ లక్ష్యం మేరకు 4లక్షల 90వేల మొక్కలు నాటేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మండలవ్యాప్తంగా మొక్కలు నాటేందుకుగానూ 325 స్థలాలను ఎంపిక చేశాం. వీటితోపాటు రైతుల పొలాల్లో నాటేందుకు మొక్కలు పంపిణీ చేస్తాం. ఇంటి ఆవరణలో నాటుకునేందుకు ఆరు పండ్లు, పూలమొక్కలు అందజేస్తాం. ఈ మహత్తర కార్యక్రమానికి మండలంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ప్రజలు సహకరించాలి.
– శ్రీలత, ఎంపీడీవో, నవాబ్‌పేట
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

