మహబూబ్‌నగర్, జూన్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మహబూబ్‌నగర్ స్థాని క సంస్థల ప్రజాప్రతినిధుల శాసనమండలి ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ అభ్యర్థి ఘోర పరాజయం మూటగట్టుకున్నారు. మన్నె జీవన్‌రెడ్డిపై 109 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి ఘన విజయం సాధించారు. సాక్షాత్తు సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కారు జోరు కనిపించింది. ఇక్కడి ప్రజాప్రతినిధులు గులా బీ పార్టీవైపే నిలబడ్డారు. శాసన మండల ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలవడంతో ఒక్కసారి గా ఆ పార్టీ శ్రేణులు షాక్‌కు గురయ్యారు. ఓటమి పై సైలెంట్ అయ్యారు. ఓ మామూలు మాజీ జె డ్పీటీసీ సత్తా చాటడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్‌కుమార్‌రెడ్డిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి అభినందించారు. కాగా జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీ ఆర్ఎస్కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన స్థానిక ప్రజాప్రతినిధులను అభినందించారు. ఈ విజయాన్ని అమరవీరులకు అంకితమిస్తున్నట్లు మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. తనను ఆదరించి గెలిపించిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియల్ సభ్యులకు నవీన్‌కుమార్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయా న్ని కేసీఆర్‌కు కానుకగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రజాప్రతినిధుల శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన నవీన్ కుమార్‌రెడ్డికి రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రవినాయక్ గెలుపు ధ్రువపత్రాన్ని అందజేశారు. అనంతరం కౌంటింగ్ కేంద్రం ఎదుట భారీ ఎత్తున పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాలుస్తూ కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్సీగా గెలుపొందగానే మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నా రు. కాగా ఓటమిని ముందే గ్రహించిన కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డి కౌంటింగ్ హాల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. కాంగ్రెస్ ఓటమిపై ఎ మ్మెల్యేలు సైలెంట్ కావడం.. ఉప ఎన్నికల్లో ఓట మి ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ కలిగించింది.
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓట్ల కౌంటింగ్ ప్రక్రియలో అనుక్షణం ఉత్కంఠ మొదలైంది. బీఆర్ఎ స్ శ్రేణులు ముందుగానే గెలుపుపై ధీమాతో ఉ న్నారు. దీంతో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రె డ్డి, రాజేందర్‌రెడ్డి, అంజయ్య యాదవ్ కౌంటిం గ్ ఏజెంట్లుగా వ్యవహరించారు. ఉదయం 7 గంటలకే కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూములు తెరిచి బ్యాలెట్ బాక్స్‌లను కౌంటింగ్ కేంద్రానికి తరలించా రు. అనంతరం బాక్స్‌లో ఉన్న బ్యాలెట్ పత్రాలను తీసి ఒక డ బ్బాలో వేశారు. వాటన్నింటి నీ కలిపి 25 ఓట్ల చొప్పు న బెండళ్లు కట్టారు. మొత్తం 1,437 ఓట్లు పోలవగా.. ఆ తర్వాత ప్రాధాన్యత క్రమం లో ఒక్కొక్క ఓటు లె క్కించారు. కోటా ఓట్లు నిర్ధారించి ఆపై వచ్చిన ఒక్క ఓటుతో అభ్యర్థి గెలుపొందినట్లు ప్ర కటించారు. కాగా కట్టలు కట్టిన బ్యాలెట్ పత్రాల నుంచి ఒక్కో ఓటును ప్రాధాన్యత క్రమంలో కౌంటింగ్ టేబుల్స్‌పై వేస్తుంటేనే కాంగ్రెస్ నాయకులు డీలా పడిపోయారు. బీఆర్ఎస్ అభ్యర్థికి ఎక్కువ మొత్తం ఓట్లు రావడంతో అప్పటికే ఓటమి నిర్ధారించుకున్నారు. కౌంటింగ్హాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డి మొహం పాలిపోయింది. దీం తో ఆయన కౌంటింగ్ హాల్ నుంచి మీ డియా కంటపడకుండా వెళ్లిపోయా రు. కాగా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ బయటకు వచ్చి ఆధిక్యతలో ఉన్నానని ప్రకటించడంతో ఒక్కసారిగా మీడియా సెంటర్లో బీఆర్ఎస్ విజయం వైపు వెళ్తున్నదని ఖాయమైంది.
ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి బీఆర్ఎస్ పా ర్టీ పకడ్బందీగా వ్యూహరచన చేసింది. ఎమ్మెల్సీగా ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొనగా.. చాలామంది మాజీ ఎమ్మెల్యేల పేర్లు పరిశీలనకు వచ్చాయి. కాగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తన నియోజకవర్గానికి చెందిన నవీన్‌కుమార్‌రెడ్డికి టికెట్ ఇ వ్వాలని పట్టుబట్టారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్, షాద్‌నగర్‌కు చెందిన నవీన్‌కుమార్‌రెడ్డి పేరు తెరమీదకు వచ్చింది. పార్టీ అధినేత టికెట్ ఇవ్వడంతో శ్రేణులంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చాలెంజ్‌గా తీసుకొని ఎలాగైనా గెలవాలని.. అధికార పార్టీ కి షాక్ ఇవ్వాలని భావించారు. అందుకు తగ్గట్టుగానే ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, పట్నం నరేందర్‌రెడ్డి, అంజయ్య యాదవ్‌తో పాటు పార్టీ నేతలు స్థానిక ప్రజాప్రతినిధులను గడప దాటకుండా కట్టడి చేశారు. ఈలోపు కాంగ్రెస్ అధికారంలో వచ్చినా గ్యారెంటీలను అమలు చేయకపోవడం.. ప్రజా వ్యతిరేకత రావడంతో స్థాని క ప్రజాప్రతినిధులు ఆ పార్టీలోకి వెళ్లడాని కి జంకారు. ఇది కూ డా బీఆర్ఎస్కు కలి సి వచ్చింది. దీంతో నియోజకవర్గాల్లో ఉ న్న బీఆర్ఎస్ ముఖ్య శ్రేణులు పక్కావ్యూహంతో ముందుకు కదిలారు. ప్రజాప్రతినిధులకు పార్టీ పరిస్థితిని వివరించి మనమంతా కేసీఆర్ వెంటే ఉండాలని పిలుపునిచ్చారు. కాగా, అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేసినా పార్టీ మారలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల చివరి రోజు వర కు కాంగ్రెస్ అనేక కుయుక్తులు పన్నింది. ఇక పోలింగ్ ముగియగానే బీఆర్ఎస్ గెలుస్తుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. దీంతో భయపడిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించి పార్లమెంట్ ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టి ఎన్నికలు పూర్తయ్యే వరకు కౌంటింగ్‌ను నిలిపివేయించింది. చివరకు అనుకున్నట్లే బీఆర్ఎస్ అభ్యర్థి అనూహ్యంగా విజయం సాధించారు.
శాసనమండలి ఉపఎన్నికల్లో గెలుపొందిన నవీన్‌కుమార్‌రెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్ అభినందించారు. మహబూబ్‌నగర్‌లో కౌంటింగ్ ముగిశాక హుటాహుటిన పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్సీ నవీన్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. గులాబీబాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నవీన్‌ను శాలువాతో సన్మానించి కేసీఆర్ అభినందించారు. వెల్డన్ నవీన్.. అంటూ భుజం తట్టారు. అంతకుముందు కేటీఆర్.. నవీన్‌కు ఫోన్ చేసి అభినందించారు. గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును కూడా నవీన్ కలిశారు.
శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు అనేక అడ్డదారులు తొక్కింది. ప్రజాప్రతినిధుల సంఖ్యాబలం లేకు న్నా ఆయా ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకొని ప్రజాప్రతినిధులను పార్టీ వైపు వచ్చేలా వారిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ క్ర మంలో కొన్ని నియోజకవర్గాల్లో కొందరు పార్టీ తీ ర్థం పుచ్చుకున్నారు. కాం గ్రెస్‌కు సపోర్ట్ చేస్తే వచ్చే స్థానిక ఎన్నికల్లో మీకే టి కెట్లు ఇస్తామని, గెలిచేందుకు కావాల్సిన వనరు లు సమకూరుస్తామని ఒ ప్పించారు. అయినా చాలామంది ప్రజాప్రతినిధులు బీ ఆర్ఎస్ వైపు కట్టుబడి ఉన్నారు. కాగా ఎన్నికల ముం దు వరకు ఎంపీ మన్నె సోదరుడి కొడుకు మన్నె జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లోనే ఉన్నారు. అధికారం మారడంతో ఆయన కూడా పార్టీ మారారు. దీంతో పారిశ్రామికవే త్త… ధనబలం ఉన్న జీవన్‌రెడ్డికి టికెట్ ఇచ్చింది. సా క్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి 200 ఓట్లతో గెలుస్తున్నట్లు అనే క సందర్భాల్లో ధీమా వ్యక్తం చేశారు. అయితే అందుకు భిన్నంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అధికార పార్టీకి భారీ ఝలక్ ఇచ్చారు.