కొల్లాపూర్ : మే 20న దేశ వ్యాప్త గ్రామీణ బందును( Rural Bandu) జయప్రదం చేయాలని సీఐటీయూ (CITU ) జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు కార్మికులకు పిలుపునిచ్చారు. శనివారం కొల్లాపూర్ మండలంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సన్నాహక సమావేశం ఆశా వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కళావతి అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడిచిపోతున్నా కార్మికులకు ఒరగబెట్టింది ఏమి లేదని అన్నారు. ఉన్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను ( Labour Codes ) తీసుకురావడం సరికాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అసంఘటిత, సంఘటిత కార్మికుల సమస్యలు పరిష్కారించడంలో నిర్లక్ష్యం చేస్తూ బడా పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు.
కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు డి ఈశ్వర్, ఐకేపీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజకుమార్, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మల్లేష్, ఆశా వర్కర్ యూనియన్ జిల్లా నాయకురాలు శ్రీదేవి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి జే వెంకటరమణ, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివవర్మ, ఆవాజ్ జిల్లా కార్యదర్శి సలీం, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు బాలస్వామి, రాణి, కరుణ, కొల్లాపూర్, పెంట్లవెల్లి, పెద్దకొత్తపల్లి, కోడేరు మండలాల కార్మికులు పాల్గొన్నారు.