మహబూబ్‌నగర్, జనవరి 10 : పాలమూరు పట్టణంలోని స్టేడియం మైదానంలో ఎస్జీఎఫ్ జా తీయ స్థాయి హ్యాండ్‌బాల్ అండర్-17 పోటీలు శు క్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ క్రీడా జ్యోతిని వెలిగించగా, వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన 36 జట్లు మార్చ్ఫాస్ట్ నిర్వహించాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపజేశాయి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్‌గౌడ్, డీవైఎస్వో శ్రీ నివాస్, ఎస్జీఎఫ్ సెకట్రరీ శారదాబాయి, బాస్కెట్‌బాల్ జిల్లా అధ్యక్షుడు జాకీర్, ఒలింపింక్ సంఘం జి ల్లా ప్రధాన కా ర్యదర్శి కురుమూర్తి గౌడ్, ఎస్జీఎఫ్ ఫీల్డ్ ఆఫీసర్ దేవేందర్ స్వామి, టోర్నీ ఆర్గనైజర్ జీయావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
తొలిరోజు బాలికల విభాగంలో ఉత్తరప్రదేశ్ జట్టు 29-3 తేడాతో జార్ఖండ్‌పై, పంజాబ్ 23-01 ఎన్వీఎస్పై, గుజరాత్ 14-05 ఉత్తరాఖాండ్‌పై, మధ్యప్రదేశ్ 22-06 విద్యాభారతిపై, బాలుర విభాగంలో డీ ఏవీ 17-16 తేడాతో మధ్యప్రదేశ్‌పై, ఢిల్లీ 26-07 పాండిచ్చేరిపై, ఎన్వీఎస్ 31-23 తేడాతో విద్యాభారతిపై, బీహార్ 24-09 ఉత్తరాఖాండ్ జట్టుపై విజయం సాధించాయి.
వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన క్రీడాకారులు, కోచ్‌లు, అఫీషియల్స్‌కు విడివిడిగా మైనార్టీ గురుకుల పాఠశాలలో వసతి ఏర్పాటు చేశారు. బెడ్లు స రిగా లేవని, మూత్రశాలలు కంపు కొడుతున్నాయని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు మ్యాచ్‌ను నిలిపివేశారు.
పాఠశాలలకు నేటి నుంచి సెలవులు ఉన్నాయని, విద్యార్థులు వెళ్లిపోయాక గదులను శుభ్రం చేయిస్తామని నిర్వాహకులు సర్దిచెప్పారు.