కొత్తకోట : కొత్తకోట పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త అయ్యప్ప క్షేత్రం ఆలయ నిర్మాణానికి కొత్తకోట పట్టణ వాస్తవ్యులైన గుడిబండ విమల నారోత్తమ్ రెడ్డి దంపతులు రూ.2,51,116 విరాళంగా ఇచ్చారు. ఆలయంలోని గర్భాలయ పిల్లర్ నిర్మాణం కోసం దాతలు ఈ మొత్తాన్ని అందజేశారు. ఈ మేరకు నారోత్తమ్ రెడ్డి అయ్యప్ప సేవాసమితి సభ్యులకు చెక్కును అందించారు.
గుడిబండ నారోత్తమ్ రెడ్డి శ్రీ రాజరాజేశ్వరి వైన్స్లో భాగస్వామిగా ఉన్నారు. నారోత్తమ్ రెడ్డి దంపతులు విరాళం అందజేసిన కార్యక్రమంలో అయ్యప్ప సేవాసమితి సభ్యులు ధూపం నాగరాజు, బలిజ లింగేశ్వర్, విశ్వనాథం గంగాధర్, వేముల సుధాకర్ రెడ్డి, సత్యం సాగర్, లక్ష్మీ నారాయణ యాదవ్, నరేష్ యాదవ్, వేముల సంతోష్ రెడ్డి, భీమ కిషోర్ పాల్గొని దాతలకు ధన్యవాదాలు తెలిపారు.