నారాయణపేట టౌన్, జూలై 29 : జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ తమవంతు కృషి చేయాలని జెడ్పీ చైర్పర్స న్ వనజాగౌడ్ అన్నారు. పట్టణంలోని శీలా గార్డెన్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జె డ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్దేశిత సమయానికి హాజరు కావాలని తెలిపారు.
మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో విద్యుత్ లైన్మెన్లు, ఆపరేటర్లు సరిగా పని చేయడం లేదని, ఇష్టం వచ్చినప్పుడు ఎల్సీలు తీసుకోవడం వల్ల కరెంట్ ఎప్పుడు వస్తుందో, పోతుందో తెలువడం లేదన్నారు. కొన్ని చోట్ల ఇనుప స్తంభంపై విద్యుత్ వైర్లకు తీగలు చుట్టుకోవడం వల్ల విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. సమావేశానికి విద్యాశాఖ అధికారి, కలెక్టర్ సైతం హాజరు కాకపోవడం వల్ల ఎమ్మెల్యే అభ్యంతరం వ్య క్తం చేశారు. మక్తల్‌లో జరిగిన మున్సిపల్ సమావేశానికి సై తం కలెక్టర్, అదనపు కలెక్టర్ హాజరు కాలేదని అసహనం వ్యక్తం చేశారు.
అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ కలెక్టర్‌కు వైర ల్ జ్వరం కారణంగా అస్వస్థతకు గురై సెలవు పెట్టినట్లు తెలిపారు. మున్సిపల్ సమావేశం బడ్జెట్‌కు సంబంధించి జరిగినట్లయితే కలెక్టర్, అదనపు కలెక్టర్ తప్పకుండా హాజరవుతారని, సాధారణ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కా వాల్సిన అవసరం లేదన్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధ్ది, విద్యుత్, విద్య, వైద్యం, మిషన్ భగీరథ, రోడ్లు భవనాలు, అటవీశాఖ, పశుసంవర్ధకశాఖ తదితర శాఖల ఆధ్వర్యం లో చేపడుతున్న పనులపై చర్చించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పద్మజారాణి, జెడ్పీ సీఈవో జ్యోతి, ఆర్డీవో రాంచందర్‌నాయక్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.