మత్తు పదార్థాలపై ఉక్కుపాదం.. నార్కోటిక్స్ స్నైపర్ డాగ్‌తో విస్తృత తనిఖీలు
ఊట్కూర్ మండల కేంద్రంలో మంగళవారం ఈగల్ ఫోర్స్ బృందంతో కలిసి ప్రత్యేక శిక్షణ పొందిన నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు ఎస్సై రమేష్ తెలిపారు.
ఊట్కూర్, ఆగస్టు 11: మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో మంగళవారం ఈగల్ ఫోర్స్ బృందంతో కలిసి ప్రత్యేక శిక్షణ పొందిన నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని బస్టాండ్, పాన్‌షాపులు, కిరాణా దుకాణాలు, కొరియర్ కేంద్రాలు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల రవాణా, నిల్వ, విక్రయాలు, వినియోగాన్ని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్సై తెలిపారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం, రవాణా లేదా సరఫరాకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1908 లేదా డయల్-100కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. తనిఖీల్లో ఏఎస్సై తిమ్మారెడ్డి, నార్కోటిక్స్ స్నైపర్ డాగ్ విక్కి, డాగ్ హ్యాండ్లర్ పీసీ రవి, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Japan | జపాన్‌లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

