ఊట్కూర్, ఫిబ్రవరి 11 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం కోసం చేపట్టిన భూ సేకరణ సర్వే పనులను మంగళవారం పోలీస్ పహారాతో చేపట్టారు. ప్రాజెక్టు నిర్మాణంలో భూ ములు కోల్పోతే భవిష్యత్‌లో తమ బతుకెట్లా సాగేదంటూ శివారు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోతున్న వారికి ఎంత పరిహారం ఇస్తారు.. తమకెట్లా న్యాయం చేస్తారో చెప్పకుండా పోలీసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ బాధిత రైతులు ప్రభుత్వ చర్యలపై ఆ గ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణంలో భాగంగా జీవో 69 ద్వారా మక్తల్ మండలం భూత్పూర్ రిజర్వాయర్ నుంచి కాన్కుర్తి వరకు మూడు చోట్ల నీటిని లిఫ్ట్ చే సేందుకు ప్రభుత్వం మొదటి దశ పనులను ప్రారంభించింది. మొత్తం రెండు దశల్లో ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం టెండర్ ప్ర క్రియను సైతం పూర్తిచేసి మెగా ఇంజినీరింగ్ కంపెనీ కి పనుల నిర్మాణం బాధ్యతలను అప్పగించింది.
భూత్పూర్ రిజర్వాయర్ నుంచి ఊట్కూర్ పెద్ద చెరు వు దాకా ఫేజ్-1 ఫేజ్ -2లో భాగంగా ఊట్కూర్ పెద్ద చెరువు నుంచి నారాయణపేట మండలం జ యమ్మ చెరువుకు అక్కడి నుంచి కాన్కుర్తి చెరువు దా కా మూడు పంప్‌హౌస్‌ల నిర్మాణం, ఓపెన్ కెనాల్, పైప్‌లైన్, విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం కోసం భూ సేకరణ సర్వే చేపట్టింది. రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన భూత్పూర్ రిజర్వాయర్ నుంచి మక్తల్, నారాయణపేట, కొడంగల్ ని యోజకవర్గాలకు సాగు నీటిని తరలించేందుకు ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి లిఫ్టు పనులకు శంకుస్థాపన చేశారు.
పనుల ప్రారంభ దశలోనే రైతుల నుంచి తీ వ్ర వ్యతిరేకత మొదలైంది. వారంరోజుల నుంచి రై తులు తమ పొలాల్లో భూ సేకరణ సర్వే కోసం వ చ్చిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను అడ్డుకొని తి ప్పి పంపిస్తున్నారు. రైతుల ఆందోళనను లెక్క చేయకుండా ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని సర్వే పనులను పూర్తి చేయిస్తోంది.
ఆయా మండలాల్లో భూ సేకరణ కోసం అధికారులను రైతులు ప్రతిఘటిస్తుండడంతో మంగళవా రం ఊట్కూర్ మండలం ఓబ్లాపూర్ శివారులో భా రీగా పోలీసులను మోహరించారు. నారాయణపేట డీఎస్పీ లింగయ్య నేతృత్వంలో ఇద్దరు సీఐలు, ఇ ద్దరు ఎస్సైలు దాదాపు ముప్పైకి పైగా కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్ల భద్రత మధ్య రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సర్వే పనులను పూర్తి చేశారు. ఉద యం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఊట్కూర్ మండలం బాపురం శివారులోని సర్వే నెంబర్ 30లో ఉన్న 70ఎకరాల ప్రభుత్వ భూ మికి తాసీల్దార్ చింత రవి దగ్గరుండి కొలతలు చేయించారు. సర్వే జరుగుతున్నంత వరకు తిప్రాస్‌పల్లి, బాపురం గ్రామాల మధ్య ప్రజల రాకపోకలను పోలీసులు అడ్డుకున్నారు. అధికారులకు తమ సమస్యలను చెప్పుకునేందుకు వస్తున్న బాపురం గ్రామ రైతులను ఎస్సై కృష్ణంరాజు ఆధ్వర్యంలో పోలీసులు గ్రామ శివారులోనే అడ్డుకున్నారు. ఇరిగేషన్ డీఈ కే తన్కుమార్, ఏఈఈ వెంకటప్ప, ఆర్ఐ మక్తల్ సీఐ చంద్రశేఖర్, మరికల్ సీఐ రాజేందర్‌రెడ్డి, ఊట్కూర్, మరికల్, మాగనూర్, మక్తల్, కృష్ణ మండలాల పోలీసులు, రెవెన్యూ అధికారులున్నారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులకు రైతులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలి. బాపురం శివారులోని సర్వే నెంబర్ 30లో సుమారు 79ఎకరాల అసైన్డ్ భూ మి ఉండగా ఇందులో మిగులు భూమికి కొలత లు నిర్వహిస్తున్నాం. ఇదేక్రమంలో రైతుల నుంచి అందిన వినతులను సైతం పరిశీలన కోసం ఉన్నతాధికారులకు పంపిస్తున్నాం. సర్వే విషయంలో రైతులు ఎలాంటి అపోహలకు గురికావద్దని సూ చించారు. అభ్యంతరాల నోటిఫికేషన్ వెలువడిన 60 రోజుల్లోగా అధికారులకు తెలియజేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.
-చింత రవి, తాసీల్దార్