‘ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్ధేశించుకొని చదవాలి.. ప్రిపరేషన్ ముఖ్యం కాదు.. ఎలా చదవాలన్నదే ప్రధానం’.. అని కేఎల్డీమ్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, డాక్టర్ షణ్ముఖరావు అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని క్రౌన్ గార్డెన్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో లక్ష్యం-2023పై అవగాహన సదస్సు నిర్వహించారు. వాగ్దేవి జూనియర్ కళాశాల 1200 మంది విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన పలువురు వక్తలు మాట్లాడుతూ విద్యాలక్ష్మి పోర్టల్‌తో విద్యారుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. కేఎల్డీమ్డ్తో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయని చెప్పారు.
మహబూబ్‌నగర్/టౌన్, డిసెంబర్ 28 : ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవడంతోపాటు అందుకు తగినట్లుగా తీర్చిదిద్దేందుకు మంచి గైడెన్స్ కావాలి. ఇది నిజమా..? కా దా..? అని ఒక్కసారి ఆలోచించం డి. ‘గురువు లేని విద్య గుడ్డిది’ అం టారు మన పెద్దలు. గురువు సూచనల తో లక్ష్యం వైపు అడుగులు వేయాలని అం టున్నది కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ.
ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఈ యూనివర్సిటీ ‘లక్ష్యం మీరు నిర్దేశించుకోండి.. అది నిజం చేసే బాధ్యత మేము తీసుకుంటాం’ అంటున్నది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలకు మరో పేరుగా నిలిచిన కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో చదివిన వి ద్యార్థులు దేశ, విదేశాల్లో రూ.లక్షల్లో జీతాలు సంపాదిస్తూ స్థిరపడ్డారు. సాఫ్ట్వేర్ రంగానికి తలమానికంగా శాస్త్ర, సాంకేతిక వైజ్ఞానిక కేంద్రంగా కేల్ డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్‌లో బీటెక్‌తోపాటు సుమారు 50 స్పెషలైజేషన్ కలిగిన సీఎస్ఈ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సీఎస్ ఐటీ, ఈసీఎస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఈఈఈ, మెకానికల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ వంటి ఎన్నో కోర్సులతో విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతోంది.
కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంజినీరింగ్ నైపుణ్యాలతోపాటు విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఘనత కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీకే దక్కుతుంది. ప్రతి వ్యక్తికీ గైడెన్స్ ఎంతో అవసరమని.. ఆ దిశగా అడుగులు వేయడం ద్వారా ఎం పిక చేసుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చని సూచనలు, సలహాలు అందిస్తున్నది. ఈ యూనివర్సిటీ ‘విద్యాలక్ష్మి’ పోర్టల్ ద్వారా వి ద్యారుణాలనూ అందిస్తున్నది. చదువు పూర్తయిన తరువాత కూ డా రుణాలు చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నది. విద్యార్థులకు ఇంటర్మీడియట్ తర్వాత ఉన్న ఉన్నత విద్యావకాశాలపై అవగాహన కల్పించడంతోపాటు విద్యార్థులు ఎలా చదవాలి..
ఎలాం టి నైపుణ్యాలు అలవర్చుకోవాలి తదితర అంశాలపై మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని క్రౌన్ గార్డెన్లో ’నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ – ‘కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ’ ఆధ్వర్యంలో ‘లక్ష్యం-2023’ పేరిట బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. అవగాహన కార్యక్రమానికి వాగ్దేవి జూనియర్ కళాశాలకు చెందిన 1200 మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. సమావేశంలో ప్రసంగించిన ఫస్టియర్ విద్యార్థిని ఓబేదాకు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో ఫీజు లేకుండా పై చదువులకు పూర్తిస్థాయిలో సహకారం అందించనున్నట్లు ప్రాఫెసర్ డాక్టర్ షణ్ముఖరావు ప్రకటించారు. విద్యార్థులను లక్కీడిప్ ద్వారా ఎంపిక చే సి.. ఓబేదా, అక్రంలకు ప్రత్యేకంగా బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థులకు యూనివర్సిటీ మెటీరియల్, ఇంటర్ తరువాత ఏం చదివితే బాగుంటుంది అనే సమాచారాన్ని అందజేశారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ రాజశేఖర్, బ్యూరో ఇన్చార్జి వెంకటేశ్వర్రావు, ఏడీవీటీ ఇన్చార్జి విజయకుమార్‌రెడ్డి, సర్క్యూలేషన్ ఇన్చార్జి జగన్ తదితరులున్నారు.
భవిష్యత్ ప్రణాళిక ఉండాలి..
విద్యార్థులకు ఇంటర్ దశ ఎం తో కీలకమైనది. ఈ దశలో భవిష్యత్‌కు సంబంధించి చక్కటి మా ర్గాన్ని ఎంచుకోవాలి. ఏం చదవాలి? ఎక్కడ చదవాలి? అనే విషయాలను పూర్తిగా తెలుసుకోవాలి. విద్యావేత్తలు, నిపుణుల సలహాలు తీసుకోవాలి. దేశవ్యాప్తంగా ఐదు వేల విద్యా సంస్థలు ఉన్నాయి. చాలా విద్యాసంస్థలు క్వాలిటీ ఇవ్వడంలో విఫలమవుతున్నాయి. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో టైలర్ కూతురు ఫీజు లేకుండా చదివి ప్లేస్మెంట్లో రూ.60 లక్షల ప్యాకేజీకి ఎంపికైంది. పట్టుదల, స్వయంకృషి ఉంటే సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చు.
విద్యాసంస్థలో చేరుతున్నప్పుడు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాకింగ్ను చూసుకోవాలి. ఎంతో మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పూర్తి చేసినా.. ఎలాంటి స్కిల్స్ లేకపోవడంతో రూ.10 వేల నుంచి రూ.25 వేల జీతానికి పనిచేస్తున్నారు. 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశంలో పేదరికం, నిరుద్యోగం విపరీతంగా ఉండే ది. అప్పటి పీఎం నెహ్రూ ఐఐటీని స్థాపించి సాంకేతిక విద్య కు పునాది వేశారు. మీ కలలను కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్, విజయవాడలో నిజం చేసుకోవచ్చు. ఈ యూనివర్సిటీలో క్రమశిక్షణ, నైపుణ్యాలతో కూడిన విద్యను నేర్చుకుంటారు.
– డాక్టర్ షణ్ముఖరావు, ప్రొఫెసర్ , కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ
మీ నుంచే చీఫ్ గెస్ట్ రావాలి..
వాగ్ధేవి జూనియర్ కళాశాల ని ర్వహించే కార్యక్రమాలకు చీఫ్‌గెస్ట్‌గా వచ్చే స్థాయికి విద్యార్థులు చేరుకోవాలి. తల్లిదండ్రుల పేర్లను చెప్పుకొని బతకడం కాదు.. వారికి మంచి పేరు తీసుకురావాలి. జాతీయ స్థాయిలో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంతో పేరుగాంచింది. ఆనాడు రాష్ట్ర సాధనకు ‘నమస్తే తెలంగాణ’ ఎంతో కృషి చేసింది. నేడు బంగారు తెలంగాణలో భాగంగా విద్యార్థులకు మంచి గైడెన్స్‌ను అందిస్తున్నది. మా కళాశాల విద్యార్థులకు సలహాలు అందించడం సంతోషంగా ఉన్నది.
– వెంకట్‌రెడ్డి, కరస్పాండెంట్, వాగ్దేవి జూనియర్ కళాశాల
‘విద్యాలక్ష్మి’తో ఎంతో మేలు..
విద్యాలక్ష్మి పోర్టల్ విద్యార్థులకు ఎంతో ఉపయోకరంగా ఉంటుంది. నిరుపేదలు సైతం తమ విద్యాభ్యాసం పూర్తి చేసిన తరువాత యూనివర్సిటీ ఫీజులను చెల్లించేందుకు ఇది సహాయపడుతుంది. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆలోచనా విధానం చాలా బాగుంది. పట్టుదల, స్వయంకృషి ఉన్న ప్రతి విద్యార్థి కలలను ఈ యూనివర్సిటీ నిజం చేస్తుందనే నమ్మకం వస్తుంది. ఏ విధంగా లక్ష్యాన్ని చేరుకుంటాం అనే విషయాలను ప్రొఫెసర్లు పూర్తిస్థాయిలో వివరించారు.
– పావనిరెడ్డి, అకాడమిక్ ఇయర్ ఇన్చార్జి, వాగ్దేవి కళాశాల
కష్టపడి చదవాలన్న తపన పెరిగింది..
కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ వారు కల్పించిన అవగాహన ఎంతో ఉ పయోగపడుతుంది. భవిష్యత్‌లో ఏదైనా సాధించాలంటే మొ దటగా మార్గాన్ని ఎంచుకోవాలని తెలుసుకున్నాను. ల క్ష్యాన్ని చేరుకోవాలన్న తపన పెరిగింది. ఉపాధ్యాయుల మాటలను శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలి. అప్పుడే నిర్దేశించుకున్న చోటును చేరుకుంటాం. నా కు కళాశాల యాజమాన్యం చాలా సపోర్టుగా ఉన్నది.
– రాజేశ్, బైపీసీ సెకండియర్, వాగ్దేవి జూనియర్ కళాశాల
డాక్టర్ కావాలనుకుంటున్నా..
కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ, నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుతో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. డాక్టర్ కావాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా. అనుకున్న మార్గాన్ని కష్టపడి చదివితే సులభంగా చేరుకోవచ్చన్న విషయాన్ని గమనించా. మంచిగా చదివి తల్లిదండ్రులు, గ్రామం, కళాశాలకు పేరు తీసుకొస్తానన్న నమ్మకం ఏర్పడింది.
– ఎస్.అనూష, బైపీసీ సెకండియర్, వాగ్దేవి జూనియర్ కళాశాల
ప్రపంచంతో పోటీపడి చదవాలి..
ప్రపంచంతో పోటీపడి చదివితేనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంతో ప్రాముఖ్యతను సొంతం చేసుకున్నది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ మంచి పేరు, ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇది మే ము చెప్పడం కాదు.. ఫోన్లో సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది. అందరికీ చదవాలనే కోరిక ఉం టుంది. కానీ, కోర్సు ఎంపికలో స్పష్టత ఉం డదు. నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. వెబ్సైట్ టాప్ 10 కళాశాలలను ఎంపిక చేసుకోవాలి. వాటిలో ఏ యూనివర్సిటీలో మంచి ఫ్యాకల్టీ, కో ర్సులు, సదుపాయాలు ఉన్నాయో గమనించాలి. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీకి నీడ్స్, న్యాక్ ప్లేస్ గుర్తింపు ఉన్నది. విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో వచ్చి యూనివర్సిటీని సందర్శించి వివరాలు సేకరించాలి. అప్పుడే తుది నిర్ణయం తీసుకొని లక్ష్యం వైపు అడుగులు వేయాలి.
– సందీప్‌రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ