నాగర్ కర్నూల్ : నాగార్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో తమ MJR ట్రస్ట్ ద్వారా నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది.యువతీ యువకులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయనికి చేరుకొని తమ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకున్నారు.
ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన రావడం పట్ల ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఆగస్టు 2వ తేదీ వరకు దరఖాస్తులు ఫారాలు అందజేస్తామన్నారు. ఇంకా లైసెన్స్ లేని యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.