అమరచింత : ఆత్మకూర్ పట్టణంలోని శిరిడి సాయిబాబా మందిరంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలతోపాటు అభిషేకాలు నిర్వహించబడతాయని ఆలయ ప్రధాన కార్యదర్శి శివాజీ ప్రభాకర్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా శనివారం ఆయన సాయిబాబా మందిర ఆవరణలో స్థానిక విలేకరులతో మాట్లాడారు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సద్గురు షిరిడి సాయిబాబాకు కొత్తకోట రుక్మిణి కరుణాకర్ రెడ్డి దంపతులచే ప్రత్యేకంగా చేయించబడిన పగిడి వస్త్రములను అలంకరించడం జరుగుతుందని, పట్టణవాసులతోపాటు సాయిబాబా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలతోపాటు విశాఖ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.