కొల్లాపూర్ : జర్నలిస్టుల మధ్య విభజన రేఖలు గీస్తున్నా 252 జీవోను సవరించాలని టిడబ్ల్యూజేఎఫ్ అకాడమీ కమిటీ కన్వీనర్ రామచందర్ డిమాండ్ చేశారు. సోమవారం కొల్లాపూర్ మండలం కృష్ణానది తీరంలోని సోమశిలలోని సోమశిల ఐలాండ్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ మూడవ మహాసభలకు రాష్ట్ర నాయకులు ఎస్కే సలీమా, రఘు, కృష్ణయ్యలతో కలసి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డ్ జర్నలిస్టులు అంటూ వేరు చేసే పరిస్థితులను తీసుకొచ్చిందన్నారు. 252 జీవో ద్వారా మీడియా కార్డు, అక్రిడేషన్ కార్డులను తెచ్చిందన్నారు.
జర్నలిస్టుల మధ్య విభజన స్పష్టించడం మంచి పద్ధతి కాదన్నారు. ఫీచర్స్ డెస్క్ ప్రస్తుతం పని చేస్తున్నదని జర్నలిస్టులను అందరిని సమానంగా చూడాలన్నారు. సమాజం కోసం జర్నలిస్టులు పని చేస్తున్నారని పేర్కొన్నారు. కార్డులు ఎక్కువగా వస్తున్నాయని ప్రచారం జరగడం వాస్తవం కాదన్నారు. ప్రభుత్వం వేల సంఖ్యలో అక్రిడేషన్ కార్డులకు కోత విధిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే గతంలో ఇచ్చిన విధంగా జర్నలిస్టుల అందరికీ సమానంగా అక్రిడేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పోరాటలకు సిద్ధం అవుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నాయకులు పరిపూర్ణం, షక్కెర రామచంద్రం, కొల్లాపూర్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు జలకం మద్దిలేటి, బచ్చలకూర కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.