వంగూరు మండలంలో చిరుత సంచారం..భయాందోళనలో ప్రజలు
నాగర్‌కర్నూల్: జిల్లాలోని వంగూరు మండలంలో చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నెల రోజల కిందట మండలంలోని ఉమ్మాపూర్లో ఓ రైతుకు కనిపించిన చిరుత నాలుగు రోజుల కిందట గాజర గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతుపై దాడి చేసి చేతిని తీవ్రంగా గాయపరిచింది. గురువారం రాత్రి కోనేటిపూర్లో సంచిరిస్తుండగా ఓ వ్యక్తి ఫొటో తీశాడు.
సమాచారం తెలుసుకున్న రేంజ్ ఆఫీసర్ రాజేందర్, ఎఫ్ఆర్వో పర్వేజ్ అహ్మద్, డీఎఫ్ఆర్వో రేణుక ఆధ్వర్యంలో సిబ్బంది కోనేటిపూర్ గ్రామ శివారులోని సర్వాయి కుంటలో నీరు తాగడానికి వచ్చిన చిరుత జాడలను గుర్తించారు. చిరుతను పట్టుకోవడంలో భాగంగా పరిసర ప్రాంతాల్లో ఐదు కెమెరాలను శుక్రవారం ఏర్పాటు చేసినట్లు రేణుక తెలిపారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

