కొల్లాపూర్ : కొల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి ఎల్లేని సుధాకర్ రావు కార్యకర్తలతో కలిసి తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు రామచందర్ రావును కలిశారు. హైదరాబాదులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నూతన అధ్యక్షుడు రామచందర్ రావును కలిసి శాలువా కప్పి సన్మానం చేశారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ.. కొల్లాపూర్ నియోజకవర్గం బీజేపీ సభ్యత్వ నమోదులో చాలా ముందంజలో ఉందన్నారు. పార్టీ విజయానికి కృషిచేసి కొల్లాపూర్ బీజేపీ ఎమ్మెల్యేగా గెలిపించాలని కార్యకర్తలను కోరారు.