Kalwakurthy | కల్వకుర్తి బీజేపీకి షాక్.. బీఆర్ఎస్లో చేరిన ముద్విన్ గ్రామ బీజేపీ నాయకులు
Kalwakurthy | నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కల్వకుర్తి నియోజకవర్గం ముద్విన్ గ్రామానికి చెందిన బీజేపీ కీలక నాయకులు మూకుమ్మడిగా ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరారు.
Kalwakurthy | నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కల్వకుర్తి నియోజకవర్గం ముద్విన్ గ్రామానికి చెందిన బీజేపీ కీలక నాయకులు మూకుమ్మడిగా ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరారు. హైదరాబాద్‌లోని మాజీ మంత్రి హరీశ్ రావు నివాసంలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.
ముద్విన్ గ్రామానికి చెందిన మారగోని నర్సింహతో పాటు సీనియర్ నాయకులు గురిగల మహేశ్, పట్నం శ్రీను, పట్నం నరేశ్, జీల శ్రీశైలం, దొడ్లపాటి నర్సింహ, మారమూని మల్లయ్య, గంగాపురం రాకేశ్ సహా సుమారు 60 మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి హరీశ్ రావు గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ బీజేపీలు తోడు దొంగలు అని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని మండిపడ్డారు. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ తేలేకపోయారని, పక్క రాష్ట్రాలకు వేల కోట్లు ఇస్తుంటే మనకు గుండు సున్నా మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం మనకు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించడంలో, రాష్ట్ర హక్కులను కాపాడటంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అన్నట్లుగా వీరి వ్యవహారం ఉందని విమర్శించారు.

హామీలు అమలు చేయకపోగా, ప్రజలకే కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని హరీశ్ రావు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను.. మా బాకీ పైసలు ఎప్పుడిస్తారు అని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు కేసీఆర్ హయాంలో కళకళలాడిన కల్వకుర్తి, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు.. నేడు రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో వెలవెలబోతున్నాయని అన్నారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసి, సామాన్యుడి ఆస్తి విలువను పాతాళానికి తొక్కేశారని అన్నారు. తెలంగాణ అస్తిత్వం నిలబడాలన్నా, అభివృద్ధి పరుగులు పెట్టాలన్నా అది కేవలం కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమని స్పష్టం చేశారు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచే ఏకైక నాయకుడు కేసీఆర్ అని అన్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని హరీశ్‌రావు అన్నారు. జైపాల్ యాదవ్ నేతృత్వంలో కల్వకుర్తిలో మళ్ళీ గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
- Tags
- BJP
- BRS
- harish rao
- Kalwakurthy
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

