Harish Rao | కొత్తగా ‘కొండల్ రెడ్డి బ్యాంక్’ అని పెడ్తడో ఏమో.. ఎస్బీఐ విషయంలో రేవంత్ రెడ్డి తీరుపై హరీశ్ రావు
Harish Rao | రేవంత్ రెడ్డి ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నిషేధిస్తా అంటున్నడు.. రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వరల్డ్ బ్యాంక్ కూడా నీ మాట వినలేదనుకో దాన్ని కూడా నిషేధిస్తా అంటాడు అని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
Harish Rao | హైదరాబాద్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పటి ప్రభుత్వం ఎకరం భూమిచ్చింది. రేవంత్ రెడ్డి బ్యాంక్‌కు ఇచ్చిన భూమిని అమ్మేసిండని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. అచ్చంపేట బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎస్బీఐకి ఇచ్చిన భూమిని వేలానికి ఇచ్చిండు.. భూమిని అమ్మేసిండు. అమ్మేస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్టుకు వెళ్లింది. మాకు ఎకరం భూమి ఇచ్చిర్రు. ఇది కూడా ఉచితంగా ఏం ఇయ్యలేదు. మేము దాదాపు రూ.20 కోట్లు పెట్టి ఈ భూమి కొనుక్కున్నమని.. ఈ భూమి మా పొజిషన్లో ఉన్నది. పైసల్ పెట్టి కొన్న మా భూమి రేవంత్ రెడ్డి ఎట్లా అమ్ముకున్నడు.. అని హైకోర్టుకు పోయారన్నారు.
కోర్టు వాళ్లు పైసలు పెట్టి కొన్నది నిజమే కదా ఈ అమ్మకం తప్పు అని స్టే ఇచ్చింది. ఖతం రేవంత్ రెడ్డి ఎస్బీఐ మీద పగపట్టిండు. ఎస్బీఐని నిషేధిస్తాం. ఎస్బీఐలో ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లు బయటకు తీసేస్తాం. ఎస్బీఐకి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే ఖాతాలన్ని తీసేస్తా.. అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా బ్లాక్ మెయిల్ చేస్తుండు.. రేవంత్ రెడ్డి తీరు ఎవరన్నా ప్రశ్నిస్తే పగబడ్తమన్నట్టు ఉంది.
ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నిషేధిస్తా అంటున్నడు.. రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వరల్డ్ బ్యాంక్ కూడా నీ మాట వినలేదనుకో దాన్ని కూడా నిషేధిస్తా అంటాడు అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఒక ఒక బ్యాంక్ అయితే కావాలి కదా.. ఎవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ బ్యాంక్‌నే నిషేధిస్తా అంటే మరి ఏం చేస్తడు.. నాకో డౌటు..కొత్తగా కొండల్ రెడ్డి బ్యాంక్ అని పెడ్తడో ఏమో.. పెట్టినా పెడ్తడు మస్త్ జమ అయినయ్ పైసలు. రేపు ఎనుముల కొండల్ రెడ్డి బ్యాంక్ అని పెట్టినా పెడ్తరన్నారు హరీశ్ రావు.
రేవంత్ రెడ్డి SBI బ్యాంక్ తీసేసి కొండల్ రెడ్డి బ్యాంక్ పెడతాడు
రేవంత్ రెడ్డిని ఎవరైనా ప్రశ్నిస్తే పగబడుతాడు
ఎస్బీఐకి ప్రభుత్వం ఇచ్చిన భూమిని అమ్మేసి, ఇవాళ ప్రశ్నించినందుకు ఎస్బీఐని నిషేధిస్తా అంటున్నాడు.. రేపు ఆర్బీఐ, వరల్డ్ బ్యాంక్ కూడా నీ మాట వినకపోతే వాటిని కూడా నిషేదిస్తా… https://t.co/1rjpnzVdgx pic.twitter.com/rbALnhpy8h
— Telugu Scribe (@TeluguScribe) June 22, 2026
Read Also :
Maa Inti Bangaram | బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మా ఇంటి బంగారం’.. రెండు రోజుల్లో రూ.25 కోట్లకు పైగా వసూళ్లు!
Baahubali Docuseries | ‘బాహుబలి’ తెరవెనుక కథ.. జూన్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది టార్చ్ బేరర్’ డాక్యుమెంటరీ సిరీస్
Tandur | తాండూర్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

