తిమ్మాజీపేట, జూలై 4: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 9న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా, తాము సమ్మెకు వెళ్తున్నట్లు తిమ్మాజిపేట మండల కేంద్రంలోని టీజీబీసీఎల్ స్టాక్ పాయింట్ హమాలీలు (Hamali Strike) తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి, నాలుగు కోడ్లు తీసుకొచ్చి, కార్మిక హక్కులను కాలరాస్తున్నదని విమర్శించారు.
47 కోట్ల మందికి నష్టం కలిగేలా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా తాము సమ్మెకు వెళ్తున్నట్లు హమాలీలు తెలిపారు. ఒకరోజు సమ్మెలో శాంతియుతంగా నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ మేరకు సమ్మె నోటీసును స్టాక్ పాయింట్ డిఎం శ్రీధర్ కు శుక్రవారం అందజేశారు. కార్మిక సంఘం నాయకులు బాలరాజ్, జీవన్, మధు తదితరులు పాల్గొన్నారు.