లింగాల మే 13 : లింగాల మండలంలోని జీలుగుపల్లి గ్రామ శివారులో వ్యవసాయ పొలంలో లేగ దూడపై చిరుత పులి దాడి చేసిన సంఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఫారెస్ట్ బీట్ అధికారి ఖాదర్ భాషా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జీలుపల్లి గ్రామానికి చెందిన పూసల సైదులు అనే రైతు గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్దగల దొడ్లో పశువులను కట్టేసి ఇంటికి వెళ్లిపోయాడు. మంగళవారం తెల్లవారుజామున దొడ్డి వద్దకు వెళ్లి చూడగా లేక దూడ కనిపించలేదు.
దీంతో చుట్టుపక్కల వెతకగా సమీపంలో ఉన్న చెట్ల పొదలలో దూడ చనిపోయి ఉండటంతో అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు లేగ దూడను చిరుత పులి చంపేసినట్లు నిర్ధారించారు. చిరుతపులి గ్రామంలోని ఆవులు పై దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళన గురవుతున్నారు. వెంటనే చిరుతను బంధించాలని అధికారులను కోరారు.