కల్వకుర్తి, ఫిబ్రవరి 12 : అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం బుధవారం మాడ్గుల మండలానికి వచ్చిన నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డికి చుక్కెదురైంది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎందుకొచ్చారని మండలవాసులు నిలదీశారు. ఫ్లకార్డులను ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. సమాధానాలు చెప్పకుం డా తిరిగి వెళ్తున్న ప్రజాప్రతినిధుల వాహనాలు అడ్డుకున్నారు. చివరకు పోలీసుల జోక్యం తో సదరు ప్రజాప్రతినిధులు తిరుగుము ఖం పట్టే పరిస్థితి ఏర్పడింది.
ఇర్విన్, అందుగుల గ్రామాల్లో..
అభివృద్ధి పనుల శంకుస్థాపనల కోసం ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఇర్విన్ గ్రామానికి రాగానే గ్రామస్తులు ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఇర్విన్ గ్రామాన్ని మండల కేంద్రం చేస్తానని హామీ ఇచ్చారు..హామీ ఏమైందంటూ నినాదాలు చేశారు. ఇర్విన్ మండలకేంద్రం ఏర్పాటు చేయాలని, ఇర్విన్ రిజర్వాయర్ను రద్దు చేయాలని డిమాం డ్ చేస్తూ, ఫ్లకార్డులతో ప్రజాప్రతినిధులు వాహనాలు చుట్టుముట్టారు. ఎన్నికల ముందు హామీల స్వర్గం చూపి, ఎన్నికలయ్యాక హామీల ఊసే లేకుండా మమ్మల్ని నరకయాతకు గురిచేస్తారా అంటూ ఇర్వి న్ వాసులు మండిపడ్డారు. అందుగుల గ్రామంలో కూడా ఎంపీ, ఎమ్మెల్యేలకు ఇదే పరిస్థితి ఎదురైంది.
ఎంపీ ఎమ్మెల్యే లు గ్రామానికి రాగానే వా రి వాహనాల ను గ్రామస్తులు చుట్టుముట్టారు. అందుగుల వాగుపై వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వంతెన ఏమైందని గ్రామస్తులు నీలదిశారు. వంతెన లేక చుట్టు తిరిగి పోవాల్సి వస్తుందని, ఒకసారి వాగును పరిశీలించాలని గ్రామస్తులు ఎంపీ, ఎమ్మెల్యేను కోరారు. వారు సరేనని కొంతం దూరం వచ్చి, వాగుచూడకుండానే తిరుగుముఖం పట్టడంతో గ్రామస్తులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల వాహనాలను అడ్డుకున్నారు. రైతు భరో సా, రుణమాఫీ ఏయా యే..హామీలు నేరవేర్చాలని అడిగితే త ప్పించుకుపోతారా అంటూ మండిపడ్డారు. చివరకు పోలీసు లు గ్రామస్తులను పక్కకు పంపించి ప్రజాప్రతినిధులు వా హనాలను పంపించివేశారు. ఎన్నికలకు ముందు ఓడ మల్లన్న.. ఎన్నికలయ్యాక బోడ మల్లన్న అంటూ తప్పించుకు తిరిగే కాలం పోయిందని గ్రామస్తులు అనడం కొసమెరుపు