నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 3: నాగర్‌కర్నూల్ కలెక్టర్ మెయిల్‌కు గురువారం బాంబు బెదిరింపు మెసేజ్ కలకలం రేపింది. అల్లాహు అక్బర్ అనే పేరుతో ఉదయం 7:30 గంటలకు మెసేజ్ రాగా అధికారులు మధ్యాహ్నం చూసుకున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు కలెక్టరేట్‌ను బాంబులతో పేలుస్తామంటూ మెసేజ్‌లో ఉండడంతో కం గుతిన్న అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న కలెక్టరేట్లోని ఆయా శాఖల అధికారులు, సిబ్బంది బయటకు పరుగులు తీశారు.
డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు, సీఐ కనకయ్యగౌడ్ బాంబు స్కాడ్, డాగ్‌స్కాడ్ బృందాలతో కలెక్టరేట్‌కు చేరుకొని పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మెసేజ్‌లో పెట్టిన 3:30 గం టల సమయం వరకు కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది టె న్షన్‌కు గురయ్యారు. సమయం దాటిపోవడం, ఎలాంటి ఘటన చోటు చేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పోలీసులు మెయిల్‌కు వచ్చిన మెసేజ్‌పై దర్యాప్తు ప్రారంభించారు. మెయిల్ చేసిన వ్యక్తి పేరు ముప్పాల లక్ష్మణరావు అని ఉండడం, దాని కింద అల్లాహ్ అక్బర్ అని ఉందని డీఎస్పీ మీడియాకు వివరించారు. ఇది ఫేక్ మెసేజ్‌గా గుర్తించారు. మెయిల్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాన్నారు.