మహబూబ్‌నగర్‌టౌన్, మే 28 : ని రుద్యోగ యువతీ, యువకులు కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ సంక్షేమ సలహాదారు, రిటైర్డ్ ఐపీఎస్ ఏకే.ఖాన్ పిలుపునిచ్చా రు. ఇందుకోసం ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కోచింగ్ కేంద్రాలను సద్వినియో గం చేసుకోవాలని కోరారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బీకే రెడ్డి కాలనీలో ఉన్న మైనార్టీ గురుకుల బాలుర పాఠశాల-1లో గ్రూప్స్ కోసం అందిస్తున్న ఉచిత కోచింగ్‌ను ఆ యన తనిఖీ చేశారు. అంతేగాక కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులతో మాట్లాడా రు. కోచింగ్ ఎలా ఉందని? సౌకర్యాలు ఎలా ఉన్నాయని.. అడిగి తెలుసుకున్నా రు. తర్వాత పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్స్, మైనార్టీ అధికారితో జిల్లాలో ఉ న్న మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలల పని తీరుపై సమీక్షించారు.
పదో తరగతి తర్వాత విద్యార్థులకు ఉండే అ వకాశాలు, అదే విధంగా ఇంటర్ తర్వా త ఒకేషనల్ కోర్సులు, ఇతర అవకాశాల పై విద్యార్థులకు అవగాహన కల్పించాల ని సూచించారు. ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత వేసవిలో జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ అంశాలపై ప్రత్యేక తరగతులు నిర్వహించి వివిధ కోర్సుల గురించి విద్యార్థులు తెలియజేయాలని సూచించారు. తరగతి గదిలో చివరి విద్యార్థిపై దృష్టి కేంద్రీకరించాలని అధ్యాపకులు, ఉపాధ్యాయులను ఆదేశించారు. చదువుతోపాటు క్రీడలపై ఆస క్తి ఉన్న విద్యార్థులను గుర్తించి స్పోర్ట్స్ ఎక్సలెన్స్‌కు పంపించేలా చూడాలన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ ప్రభుత్వం 80 వేల ఉద్యోగా ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో మైనార్టీ విద్యార్థులకు ఉచిత కో చింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. దీంతో ఎక్కు వ ఉద్యోగాలు సంపాదించుకోవడంలో భాగంగా మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా గ్రూప్స్ కోచింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. కోచింగ్ నిర్వహణపై సంతోషం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఐపీఎస్, ఐఏఎస్‌లు ఎంపికావుతున్నారని గుర్తు చేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని ఉద్యోగాలు సంపాదించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మైనార్టీ ఫై నాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఇంతియాజ్‌ఇసాక్, ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ సీతారామారావు, మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి శంకరాచారి, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.