నాగర్‌కర్నూల్/ఊట్కూర్/కల్వకుర్తి, ఏప్రిల్ 4 : వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకు డు, జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు హ బీబ్ ఉర్ రహెమాన్, ముస్లిం నాయకుడు మహ్మద్ హబీబ్‌ఖాన్, ముస్లిం హక్కుల సాధన సమితి అధ్యక్షుడు మహ్మద్ నిజాం, వక్ఫ్ కాం ప్లెక్స్ కమిటీ కార్యదర్శి పఠాన్ అబ్దుల్లాఖాన్, బీఎస్పీ నాయకుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ దేవుడికి అంకితం చేస్తూ ముస్లిం దాతలు ఇచ్చి న భూములు వక్ఫ్‌బోర్డు పరిధిలో అనాదిగా ఉ న్నాయన్నారు.
వక్ఫ్ ఆస్తులపై కేంద్రంలోని బీజే పీ ప్రభుత్వం ముస్లింలపై ద్వేషంతో బడాబాబులకు అంటగట్టడానికి చట్టంలో మార్పు లు తీసుకొని వస్తుందన్నారు. పేదలకు చెందాల్సిన భూములను లాక్కోవడం ద్వారా ముస్లింలను ఆర్థికంగా బలహీనులను చేసి రాజకీయంగా, సా మాజికంగా ఎదగకుండా చేయాలన్నది బీజేపీ లక్ష్యమని వారు ఆరోపించారు. ఊట్కూర్ మండల కేంద్రంలోనూ ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించి తాసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తాసీల్దార్ చింత రవికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జేఐహెచ్ నాయకులు అబ్దుల్ ఖ య్యూం, మండల అధ్యక్షుడు మన్సూర్ అలీ, ఎంఐఎం నగర అధ్యక్షుడు మహ్మద్ ఇస్మాయి ల్, సీపీఐ (ఎంఎల్-మాస్‌లైన్) జిల్లా నాయకుడు సలీం మాట్లాడు తూ దేశవ్యాప్తంగా ము స్లిం మైనార్టీల ఆస్తులకు రక్షణగా ప్రత్యేక వక్ఫ్ చట్టాన్ని రాజ్యాంగం అ మలు చేసిందని, మోదీ ప్రభుత్వం ము స్లింలను అణగదొకేందుకు ఈ చట్టాలనికి సవరణలు చే యాలని చూస్తున్నదని, దీనిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే వక్ఫ్ బిల్లు ను వ్యతిరేకిస్తూ కల్వకుర్తి పట్టణంలోనూ ము స్లింలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతోపాటు, హోం మంత్రి, సీఎం లు చంద్రబాబు, నితీశ్‌కుమార్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం ఆర్టీవో శ్రీనూనాయక్ కు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ముస్లింలు పాల్గొన్నారు.