భూత్పూర్, ఫిబ్రవరి 19 : మండలంలోని కొత్తమొల్గర సమీపంలో సోమవారం బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ తెలిపారు. ఆత్మీయ సమ్మేళనంపై సోమవారం మున్సిపాలిటీలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు మరింత దగ్గరయ్యేందుకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆత్మీ య సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి దాదాపు 10వేలమంది హాజరయ్యే అవకాశం ఉందని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. కా ర్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సత్తూర్ నారాయణగౌ డ్, అశోక్‌గౌడ్, సదానంద్‌గౌడ్, బోరింగ్ నర్సింహులు, గడ్డం రాములు, ప్రేమ్‌కుమార్, నర్సింహులు పాల్గొన్నారు.