ఖమ్మంవాసిని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఆయన ఒక్క మంచి పని కూడా చేయలేదు. ఖమ్మం వాసులకు నాగర్‌కర్నూల్ ప్రజలపై ప్రేమ ఎందుకుంటుం ది. ఎన్నికలు ముగియగానే పదవులు పొంది కనిపించకుండా పోతారు. నియోజకవర్గానికి నిధులను తీసుకురావడంలో ఎంపీలు అలసత్వం వహించడం వల్లే నష్టం జరిగింది.
రాజకీయ పబ్బం గడుపుకొనేందుకే ఈ పార్లమెంట్ స్థానాన్ని నాయకులు వాడుకున్నారు. బీజేపీకి ఓటేస్తే మన బొంద మనం తవ్వుకున్నట్లే. 26 ఏండ్ల అనుభవంతో చెబుతున్నా.. బీజేపీ అత్యంత ప్రమాదకరమైనది. వారికి మళ్లీ అధికారమిస్తే రాజ్యాంగాన్నే మారుస్తారు. పాలించే ఇగురం లేక కాంగ్రెసోళ్లు రాష్ర్టాన్ని ఆగం చేస్తున్నారు. ఓటర్లు అప్రమత్తంగా ఉండి బీఆర్ఎస్ను గెలిపించాలి.
– ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి