మరికల్ : కేంద్ర నిధులతోనే గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ( MP Aruna) అన్నారు. శుక్రవారం రూ. 2. 50 లక్షల ఎంపీ నిధులతో మంజూరైన హైమాస్ట్ లైట్లను ( High mast lights) మరికల్ మండలంలోని పసుపుల గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, ప్రతి పల్లెకు ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద రహదారుల ఏర్పాటు కేంద్రం చేపట్టిందని గుర్తు చేశారు. అనంతరం గ్రామంలో నూతనంగా ప్రతిష్టించిన శివలింగ, నాభిశిల, ధ్వజస్తంభ, నవగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, బీజేప మండల అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్, నాయకులు నర్సం గౌడ్, బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి, డోకూరు తిరుపతిరెడ్డి, పసుపుల మాజీ సర్పంచ్ రాజు, రాజేష్, శ్రీరామ్, నిఖిల్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.