జడ్చర్ల, అక్టోబర్ 17 : ఎన్నికల విధులు నిర్వహించే ప్లయింగ్స్కాడ్, స్టార్టిక్ సర్వైలైన్స్ టీంలు, మాడల్ కోడ్ఆఫ్ కండక్ట్ టీంలు ముమ్మర తనిఖీలు చేయాలని జడ్చర్ల ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అదనపు కలెక్టర్ మోహన్రావు అధికారులకు సూచించారు. మంగళవారం జడ్చర్ల తాసీల్దార్ కార్యాలయంలో ప్లయింగ్స్కాడ్, స్టార్టిక్ సర్వైలైన్స్ టీంలు, మాడల్ కోడ్ఆఫ్ కండక్ట్ టీంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మోహన్రావు మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని అందరూ పాటించేవిధంగా చూడాలన్నారు. ప్లయింగ్ స్కాడ్లు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించాలని, ప్రతీది పరిశీలించి వీడియోలు తీయాలని సూచించారు. ఎక్కడైనా వాహనాలను తనిఖీ చేసే సమయంలో డబ్బులు పట్టుబడితే జిల్లా కమిటీకి తెలియజేయాలని సూచించారు. పోలింగ్ స్టేషన్లలో ర్యాంపులు లేకుంటే ఏర్పాటు చే యించాలని, తాగునీరు, విద్యుత్, లాయిలెట్స్, తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సెక్టోరల్ అధికారులకు సూచించారు. జడ్చర్ల అసెంబ్లీ ఎ న్నికల సందర్భంగా తాత్కాలికంగా జడ్చర్లలోని ప్ర భుత్వ డిగ్రీ కళాశాలలో ఈవీఎంలను భద్రపర్చడం జరుగుతుందని అక్కడి నుంచే ఎన్నికల రోజు ఎన్నిక ల సామగ్రిని ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో జడ్చర్ల తాసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐలు రాఘవేందర్, సలావుద్దీన్ పాల్గొన్నారు.