అలంపూర్/రాజోళి, మే 9 : కాంగ్రెసోళ్లు దేవుళ్ల పై ఒట్లు వేసి ఓట్లు అడుక్కుంటున్నారని, వారి మా యమాటలు నమ్మి మరోసారి ఓట్లేస్తే తాటిచెట్టును చూపి కొబ్బరికాయలు కోయమని చెబుతారని ఎ మ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గురువారం ఎమ్మెల్యే విజయుడు, బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్య ర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి అలంపూర్, రా జోళిలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా చ ల్లా మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నా యకుల మాటలు విని ఒకసారి మోసపోయాం.. మరోసారి మోసం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి దే వుళ్ల మీద ఒట్టు వేసి ఓట్లు అడుగుతున్నాడన్నారు. హామీలను గాలికొదిలేసి మళ్లీ ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లోకి రాకుండా బుద్ధి చెప్పాలన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసేం దుకు చేతగాక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ దశ, దిశ మార్చిన కేసీఆర్ నడిగడ్డ ప్రజల కోసం తుమ్మిళ్ల ఎత్తిపోతలను ఏర్పాటు చేస్తున్నారన్నారు.
ప్రవీణ్‌కుమార్ చదువుకున్నోడు, మేధావి, ఐపీఎస్ ఉద్యోగం వదులుకొని మనకు సే వ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారన్నారు. అటువంటి వ్యక్తిని గెలిపించుకుంటే మనకు ఎంతో మే లు జరుగుతుందన్నారు.
అలంపూర్ ప్రజలు ఏమనుకున్నా కచ్చితంగా చేస్తారని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. గతంలో తనకు ఇచ్చిన మెజార్టీకి రెండింతలు ఆర్ఎస్పీకి అందించాలని కోరారు. అంతకుముందు ఆర్ఎస్పీ పట్టణంలోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలు, షా అలీ ఫహిల్వాన్ దర్గాను దర్శించుకొని బీఆర్ఎస్, ఎమ్మార్పీఎస్ నాయకులు బల్గెర్ హుస్సేన్ మాదిగ, ప్రేమదాసు, లక్ష్మణ్‌తో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. మీ బిడ్డగా ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మనోరమ, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, రాజోళి మాజీ సర్పంచ్ గోపాల్, గంగిరెడ్డి, హుస్సేన్, యు వనాయకులు కిరణ్‌కుమార్‌రెడ్డి, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
తానూ నడిగడ్డ బిడ్డనే అని.. ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని బీఆర్ఎస్ కందనూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుల మా టలు నమ్మి మోసపోవద్దని సూచించారు. బీఆర్ఎస్ పార్టీపై నమ్మకం ఉంచి తనను గెలిపిస్తే పార్లమెంట్లో ప్రజా సమస్యలపై గళం విప్పుతానన్నారు. వెనుకబడిన అలంపూర్ నియోజకవర్గానికి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అ భివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృ షి చేస్తానన్నారు. కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.