మహబూబ్‌నగర్ విద్యావిభాగం, సెప్టెంబర్ 29: క్రిస్టియన్‌పల్లిలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవాలను వచ్చే ఏడాది ఘనంగా నిర్వహించుకుందామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం కళాశాలలో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కళాశాల అభివృద్ధికి అన్నివిధాలుగా సహాయ, సహకారాలు అందజేస్తామన్నారు.
ఎంవీఎస్ కళాశాలకు రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా అంతా కలిసి కృషిచేద్దామని పిలుపునిచ్చారు. సమావేశంలో పూర్వవిద్యార్థుల అసోసియేషన్ అధ్యక్షుడు బుర్రి వెంకట్రామ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కేఎస్.రవికుమార్, ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.పద్మావతి, సీనియర్ న్యాయవాది మనోహర్‌రెడ్డి, వినోద్‌కుమార్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.