మహబూబ్‌నగర్, ఆగస్టు 30 : తమ సమస్యలపై స్పందించాలంటూ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అష్టకష్టాలు పడుతూ కళ్లు కన్పించక.. నడవడానికి రాక.. తినడానికి తిండిలేని కటిక దారిద్రంలో ఉం టూ కాసింత గూడు కట్టుకుందామనుకుంటే నకిలీ దస్ర్తాలు,
పట్టాలు అంటూ అధికారులు నిర్మాణాలు కూల్చేశారని వాపోయారు. ఈ విషయంపై స్పందించాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి స్పందించి.. శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మీరు తాసీల్దారు కార్యాలయంలో సమగ్ర వివరాలు అందించాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇండ్ల పథకాల్లో మీకు ప్రాధాన్యత ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.