నారాయణపేట, నవంబర్ 3: బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 18, 19 వార్డుల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి గడపగడపకు వెళ్లి ప్రభు త్వం చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలను, మ్యానిఫెస్టోను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. పట్టణం మరింత అభివృద్ధ్ది చెందాలంటే కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా మరోసారి ఎస్. రాజేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి, కౌన్సిలర్లు గురులింగం, రాజేశ్వరీ, శిరీష, నారాయణమ్మ, అనిత, మేఘా, మాజీ కౌన్సిలర్ విజయలక్ష్మీ, సీనియర్ నాయకులు మహిమూద్ తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట టౌన్, నవంబర్ 3: సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారని పార్టీ నాయకులు అన్నారు. శుక్రవారం పట్టణంలోని వివిధ వార్డుల్లో సీనియర్ నాయకులు బస్సపురంవెంకట్రాములు, శివరాంరెడ్డి, చంద్రశేఖర్, జగదీశ్, ప్రతాప్‌రెడ్డి, కార్తీక్ తదితరుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటి తిరుగుతూ బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను వివరించి కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిని భారీ మెజా ర్టీతో గెలిపించాలని కోరారు.
నారాయణపేట రూరల్, నవంబర్ 3: పేట మండల ంలోని చిన్నజట్రం, జిలాల్‌పూర్, అంత్వార్, అభంగపూర్, అప్పిరెడ్డిపల్లి, జాజాపూర్, సింగారం, బండగొండ, భైరంకొండ తదితర గ్రామాల్లో శుక్రవారం బీఆర్ఎస్ నాయకుల ఇంటిటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి చేసిన అభివృద్ధి, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటేసి ఎస్.ఆర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్య క్ష, కార్యదర్శులు వేపూరి రాములు, రవీందర్‌గౌడ్, రైతు బంధు సమితి జిల్లా సభ్యులు కోట్ల జగన్మోహన్రెడ్డి, అలీశేర్, నాయకులు రాము, ఆంజనేయులు, వెంకటప్ప, కనకప్ప, విశ్వనాథ్, హన్మం తు, కిష్టప్ప పాల్గొన్నారు.
మరికల్, నవంబర్ 3 : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే అభివృద్ధ్ది జరిగిందని బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు రాజేశ్‌యాదవ్, మాధ్వార్ సర్పంచ్ పూణ్యశీల అన్నారు. శుక్రవారం మండల కేంద్రంతో పాటు మాధ్వార్, పల్లెగడ్డ, ఇబ్రాహీంపట్నం, ఎలిగండ్ల, అప్పంపల్లి, పెద్దచింతకుంట గ్రామల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికీ తిరుగుతూ ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేసిన ఘనత ఎమ్మెల్యే ఎస్.ఆర్ రెడ్డిదేనన్నారు. అభివృద్ధ్దిని చుసి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రామస్వామి, బసంత్, కొండారెడ్డి, జగదీశ్, నారాయణ, బాలస్వామి, అంజనేయులు, కృష్ణారెడ్డి, అశోక్‌రెడ్డి, చేన్నకేశవులుగౌడ్ పాల్గొన్నారు.
ధన్వాడ, నవంబర్ 3: మండలంలోని గున్ముక్ల, కిష్టాపూర్, కొండాపూర్, గోటూర్, చర్లపల్లి , హన్మన్పల్లి తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ను వివరిస్తూ ఎమ్మెల్యే ఎస్.ఆర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ యువ నాయకుడు వడ్ల వెంకటయ్య ఓటర్ల కాళ్లుమొక్కి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో ధన్వాడ సర్పంచ్ చిట్టెం అమరెందర్‌రెడ్డి, చంద్రశేఖర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎం.వెంకట్‌రెడ్డి, నాయకులు సచిన్, సునీల్‌రెడ్డి, సుధీర్కుమార్రావు తదితరులు పాల్గొన్నారు.
కోయిలకొండ, నవంబర్ 3: మండలంలోని వింజ మూరు, గార్లపాడ్, కేశ్వాపూర్ తదితర గ్రామాల్లో శుక్ర వారం నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ కర్త ఎస్. రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో విసృత ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా కారు గుర్తుకు ఓటు వేసి రాజేందర్‌రెడ్డిని భారీ మెజార్టితో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి సర్పంచులు నారాయణరెడ్డి, మొగులయ్య, అంజనేయులు, శ్రీనివాస్‌రెడ్డి, రాజవర్దన్‌రెడ్డి, ఉప సర్పంచ్ భీమయ్య, నాయకులు గోపాల్‌రెడ్డి, సత్యం, రాంరెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.