అలంపూర్/ఇటిక్యాల, ఏప్రిల్ 5 : రాష్ర్టాన్ని ఆగంఆగం చేస్తున్న వారికి దూరంగా ఉండాలని బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు కోరా రు. ఇటిక్యాల మండలంలోని షాబాదా గ్రామంలో ఎ మ్మెల్యే అబ్రహం అధ్యక్షతన బుధవారం బీఆర్ఎస్ ఆ త్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్సీ తక్కెళ్లపల్లి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలంతా కుటుంబంలా కలిసిమెలిసి ఉండాలన్నా రు. పొరాడి సాధించుకొన్న రాష్ట్రం గాడిలో పడుతుం టే.. బీజేపీ నాయకులు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారన్నారు. సాగు, తాగునీటి గోసలకు విముక్తి క లిగిందన్నారు.
600, 700 ఫీట్ల వరకు బోర్లు వేసినా చుక్క నీరు కూడా పడేది కాదని.. నేడు 60, 70 ఫీట్లలోనే పుష్కలంగా నీరు అందుతుందన్నారు. తొమ్మిదేం డ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి.. పక్కరాష్ట్రాల వారు కేసీఆర్ లాంటి పాలనను కోరుకుంటున్నారన్నారు. ఇది చూసి బీజేపీ నాయకుల గుండెళ్లో రై ళ్లు పరిగెడుతున్నాయన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని అన్నారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడు తూ రాష్ట్రంలో బీఆర్ఎస్కు ఎదురులేదన్నారు. నియోజకవర్గంలో దుర్భరస్థితిలో ఉన్న రోడ్డు వ్యవస్థను దాదా పు రూ.110 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. ఇటిక్యాల మండలంలో రూ.233.58 కోట్లను అభివృద్ధి, సంక్షే మం కోసం వెచ్చించామన్నారు.
ఆర్డీఎస్ కింద మూడు రిజర్వాయర్లను ప్రతిపాదిస్తూ ప్రభ్వుం రూ.780 కోట్ల ను కేటాయించిందన్నారు. త్వరలోనే మల్లమ్మకుంట రి జర్వాయర్ పనులు చేపడతామన్నారు. రెండు నెలల్లో వంద పడకల దవాఖానను ప్రారంభిస్తామన్నారు. జెడ్పీ చైర్పర్సన్ సరిత మాట్లాడుతూ కులాలు, మతాలకతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. మంచి విజ న్ ఉన్న నాయకుడు సీ ఎం కేసీఆర్ అని అన్నారు. మనలో మనకు చిచ్చులు పె ట్టే శక్తులు ఉన్నాయని, వారి తో జాగ్రత్తగా ఉండాలన్నారు.
ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతిని ధి మంద జగన్నాథం మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తుందన్నారు. దేశం కొంద రు స్వార్థపరుల చేతిలో బందీగా ఉందన్నారు. కార్యక్రమంలో మంద శ్రీనాథ్, గ ట్టు తిమ్మప్ప, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, జెడ్పీటీసీ రాజు, నాయకులు సీతారామిరెడ్డి, రాముడు, గిడ్డారెడ్డి, గోవర్ధన్, ప ల్లయ్య, రవి, తిరుపతిరెడ్డి, జయచంద్రారెడ్డి, గోవర్ద్ధన్రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, యుగంధర్‌రెడ్డి, అజయ్, చంద్రగౌడ్, శ్రీనివాసులు, నాయకులు పాల్గొన్నారు.