వడ్డెపల్లి : మండలంలోని కొంకల గ్రామం నీలకంఠేశ్వర జాతర (Neelakantheshwara Jatara) సందర్భంగా ఆదివారం రాత్రి నిర్వహించిన రాష్ట్రస్థాయి డాన్స్ పోటీలు, పుట్టింటి పట్టుచీర విజేతలకు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు (MLA Vijayudu ) ,వడ్డేపల్లి మాజీ వైస్ ఎంపీపీ చంద్రగౌడ్ బహుమతులు అందజేశారు. డాన్స్ ప్రోగామ్కు సహకరించిన దాతలకు పూలు, శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి 7వ వార్డు మాజీ కౌన్సిలర్ ఎన్ అజయ్ కుమార్ , బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి, ధర్మారెడ్డి , వడ్డే వరదరాజులు, వడ్డే సంజీవ, వేణురెడ్డి, పైపాడ్ కొండలు, వెంకటేశ్వర్ రెడ్డి, నవత ఆంజనేయులు, నాయకి శేఖర్,పెద్ది రెడ్డి, గోకారి, భీమేష్, కొంకల పెద్దలు, యువకులు పాల్గొన్నారు.