అలంపూర్/రాజోళి/వడ్డేపల్లి, ఆగస్టు 8 : తెలంగాణలోని పేదలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అండగా నిలుస్తున్నాయని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. గురువారం అలంపూర్ మం డలకేంద్రంలో గురువారం 54 మంది లబ్ధిదారుల కు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. అలాగే రాజోళి రైతువేదికలో 93 మందికి కల్యాణలక్ష్మి, ఐదుగురికి షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. శాంతినగర్‌లో తాసీల్దార్ కార్యాలయంలో 60 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడబిడ్డ పుడితే భారం అనుకునే కుటుంబాలకు కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్షానూటపదహారు అందించి అండగా నిలిచి ఆదుకున్నదని గుర్తు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కరుణ, వైస్‌చైర్మన్ సుజాత, తాసీల్దార్లు మంజుల, హరికృష్ణ, జోషి, నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, రాజు, బాబి, మహిపాల్‌రెడ్డి, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.