వైభవంగా రామలింగేశ్వరస్వామి రథోత్సవం
మండలంలోని పులిమామిడి గుట్టపై వెలసిన రామలింగేశ్వర ఉత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున రథోత్సవం వైభవంగా నిర్వహించారు. కొండపై గల కోనేరులో స్నానమాచరించిన భక్తులు భక్తి శ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం చేశారు.
- ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
- స్వామివారికి ప్రత్యేక పూజలు
ఊట్కూర్, సెప్టెంబర్ 11 : మండలంలోని పులిమామిడి గుట్టపై వెలసిన రామలింగేశ్వర ఉత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున రథోత్సవం వైభవంగా నిర్వహించారు. కొండపై గల కోనేరులో స్నానమాచరించిన భక్తులు భక్తి శ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం చేశారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ర్టాల నుంచి భక్తులు తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారుల ఆధ్వర్యంలో రామలింగేశ్వర స్వామికి అభిషే కం, అలంకరణ, మహా మంగళహారతి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం పూలతో అందగా ముస్తాబు చేసిన రథంలో రామలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించి ఊరేగించారు. ఈ సందర్భంగా గుట్టపై భక్తులు పోటీపడి తేరు ను గుంజారు. వేడుకల్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పాల్గొని తేరుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనం తరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామలింగేశ్వరుడి కృపతో ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ శాంతులు నెలకొనాలని ఆకాంక్షించారు. అలయ కమిటీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి ఉత్సవాలకు హాజరైన భక్తులకు అన్ని వసతులు కల్పించారు. ఎస్సై గోకరి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఎల్లాగౌడ్, సర్పంచ్ సూరయ్యగౌడ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
జాతర ప్రారంభం
కోస్గి రూరల్, సెప్టెంబర్ 11: మండలంలోని ముంగిమళ్ల గ్రామ గుట్టపై వెలిసిన రామలింగేశ్వర స్వామి జాతర సోమవారం ఘనంగా ప్రారంభమైందని సర్పంచ్ లక్ష్మీ తెలిపారు. సోమవారం సాయంత్రం నీలకంఠ స్వామి ఆల యం నుంచి భక్తజన సందోహం మధ్య స్వామి వారిని పల్లకిలో ఊరేగిస్తూ గుట్టపై ఆలయంలోకి చేర్చారు. అనం తరం అభిషేకాలు, ప్రతేక పూజలు చేశారు. ఆది వారం వరకు కొనసాగే ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొవాలని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

