మరికల్, జులై 10: మహబూబ్నగర్ జిల్లా మరికల్ మండల కేంద్రంలో గల మంగలోని వంపు వద్ద కల్వర్టును గురువారం నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్వర్టు నిర్మాణంతో ఈ ప్రాంత రైతులకు కూడా పొలాలకు వెళ్లేందుకు అనువుగా ఉంటుందని తెలిపారు. అంతకుముందు నాయీ బ్రాహ్మణులు భాజా భజంత్రీలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డిని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సూర్య మోహన్ రెడ్డి, నారాయణపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వినీతమ్మ, రాజు, మండల పార్టీ అధ్యక్షుడు వీరన్న, పట్టణ అధ్యక్షుడు హరీష్ కుమార్, నాయకులు రామన్ గౌడ్, లంబడి రాములు, చెన్నయ్య, గోవర్దన్ల, నాయీ బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు మంగలి రఘు, మండల బిజెపి అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్, పట్టణ అధ్యక్షుడు నర్సింలు రాయుడు, జిల్లా నాయకులు గోపాల్,అశోక్ కుమార్, శివకుమార్, శ్రీనివాసులు, రాములు, ఈశ్వర్, మోహన్, భాస్కర్, నరహరి, నవీన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.