కొల్లాపూర్, నవంబర్ 28 : అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం ముగింపు సందర్భంగా మంగళవారం సాయంత్రం కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, రోడ్‌షో నిర్వహించారు. కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో కొల్లాపూర్ మొత్తం జనసంద్రంగా మారింది.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్‌రావు, డాక్టర్ కురుమ విజయ్‌కుమార్‌తోపాటు ఆయా మండలాల ఎంపీపీటీలు, జెడ్పీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.