కేటీదొడ్డి: ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె భవనం నుంచి సొంత భవనాలు ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. కేటీదొడ్డి మండలంలో శుక్రవారం రూ.31లక్షలతో నూతనంగా నిర్మించిన మండల వనరుల భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో తాసిల్దార్, మండల ప్రజా పరిషత్ కార్యాయాలకు సొంత భవనాలు ఏర్పాటు చేస్తామన్నారు. కరోనా సమయంలో రాష్ట్రంలో గడ్డు కాలం ఏర్పాడిందని అందు వల్లనే పలు అభివృద్ధి పనులు ఆలస్యం అయ్యాయన్నారు.
లాక్డౌన్ లో అనేక ఇబ్బందులు పడిన రాష్ట్ర ప్రజలను కంటికిరేప్పలా కాపాడిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని అన్నారు. భవిష్యత్తులో మండల అభివృద్ధికి తన వంతు సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేటీదొడ్డి, గట్టు ఎంపీపీలు మనోరమ, విజయ్‌కుమార్, జడ్పీటీసీ రాజశేఖర్, వైస్ ఎంపీపీ రామకృష్ణనాయుడు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి అధికారులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.