మహబూబ్‌నగర్, మే 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రపంచ అందాల పోటీలకు వివిధ దేశాల నుంచి వచ్చిన భామలు శుక్రవారం పాలమూరులో సందడి చేశారు. జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. సాయంత్రం 5గంటలకు హైదరాబాద్ నుంచి మూడు ప్రత్యేక బస్సు ల్లో చేరుకున్న 22మంది సుందరీమణులకు కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి ఘ న స్వాగతం పలికారు. అనంతరం 16వ శ తాబ్దంలో నిర్మించిన పురాతమైన శ్రీరాజరాజేశ్వరి ఆలయంలో పూజలు చేశారు.
పిల్లలమర్రి సమీపంలోని మ్యూజియంలో కళాకృతులు, శిల్పాలను తిలకించగా, అధికారులు వాటి విశిష్టతలను గురించి తెలిపారు. అనంతరం 3ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పిల్లలమర్రి చెట్టు విశిష్టతను వివరించారు. భారతదేశంలోని అతి పురాతనమైన మర్రి చెట్లలో ఇది మూడొవదని, ఇక్కడి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఓడల మర్రి పెరిగిందని వెల్లడించారు. చెట్టు మొదలు ఊడలు, కొమ్మలను చూసి ప్రపంచ సుందరీమణులు ఆశ్చర్యపోయారు. తమ ఫోన్లలో సెల్ఫీలు తీసుకున్నారు.
ఇంత పెద్ద మర్రిచెట్టును ఎన్నడూ చూడలేదని, ప్రకృతి అద్భుతమని కొనియాడారు. పిల్లలమర్రి ఆవరణలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి. స్థానిక మహిళలతో కలిసి సుందరీమణులు బతుకమ్మ ఆడారు. గిరిజన సంక్షేమ బాలికలతో ముచ్చటించారు. అనంతరం తిరిగి హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. కాగా, పో లీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పా టు చేసింది. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, పర్ణికారెడ్డి, వీర్లపల్లి శంకర్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.