రాష్ట్ర పథకాలు దేశవ్యాప్తం కావాలి
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అ మలు కావాలని ప్రజలు కోరుకుంటున్నార ని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
- కేసీఆర్ జన్మదిన వేడుకల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ప్రగతి సారథి.. సీఎం కేసీఆర్‌కు ఉమ్మడి జిల్లా జేజేలు పలికింది. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సాధకుడు.. జననేత జన్మదినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. వాడవాడలా సంబురం మిన్నంటింది. రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేశారు. మిఠాయిలు పంపిణీ చేసి ముఖ్యమంత్రిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అనాథాశ్రమాలు, దవాఖానలు, పాఠశాలల్లో విద్యార్థులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరాలు నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన వేడుకలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఖిల్లాఘణపురం మండలం వద్ద దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డి హాజరయ్యారు. పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వనపర్తి మార్కెట్ యార్డులోవినూత్నంగా పల్లీలు, ఉలవలతో కేసీఆర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున రైతులతో కలిసి వేడుకలు నిర్వహించారు. అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విప్ గువ్వల బాలరాజు దంపతులు 500 కిలోల ఉప్పుతో 69 అడుగుల పొడవు, 69 అడుగులు వెడల్పుతో సీఎం కేసీఆర్, దేశపటాన్ని దాదాపు 22 గంటలపాటు శ్రమించి వేయించారు.
– మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్‌నగర్, ఫిబ్రవ రి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అ మలు కావాలని ప్రజలు కోరుకుంటున్నార ని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ని ఎనుగొండ రెడ్‌క్రాస్ అనాథ ఆశ్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పొలాల వద్ద సీఎం కేసీఆర్ బర్త్‌డే వేడుకలు నిర్వహిస్తున్నారంటే.. రైతుంతా ఆయనను ఏ విధంగా చూస్తున్నారో అర్థం అవుతుందని, ఈ అభిమానం ఎన్నటికీ మరువలేమన్నారు.

రైతుబంధు, రైతుబీమా, పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాల ద్వారా తెలంగాణ వ్యా ప్తంగా కోట్లాది మంది లబ్ధి పొందుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ నిండు నూరేండ్లు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నారన్నారు. ఊరూవాడా, పల్లెపట్నం అనే తేడా లేకుం డా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. కార్యక్రమంలో గంజి వెంకన్న, గోపాల్‌యాదవ్, కేసీ నర్సింహులు, రహెమాన్, తాటిగణేశ్, శివరాజ్, రెడ్‌క్రాస్ చైర్మన్ నటరాజ్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

రైతుల సంక్షేమానికి కృషి..
పాలమూరు, ఫిబ్రవరి 17 : మహబూబ్‌నగర్ మార్కెట్ యార్డులో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రైతులతో కలిసి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను జరుపుకొన్నారు. కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అన్ని రకాల పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అనంతరం మార్కెట్ యార్డు లో వేరుశనగ ఉత్పత్తులను పరిశీలించారు. కార్యక్రమంలో మా ర్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, డైరెక్ట ర్లు, సెక్రటరీ శ్రీనివాస్, సిబ్బంది, రైతులు తదితరులున్నారు.

Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

