మహబూబ్‌నగర్, జూన్ 4 : ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రతిక్షణం కంటికి నిద్రలేకుండా రక్షణ కవచంలా కాపాడే పోలీసుల సేవలు అభినందనీయమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సురక్ష ఉత్సవాలను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించా రు. అప్పన్నపల్లి నుంచి మెట్టుగడ్డ, న్యూటౌన్, బస్టాండ్ మీదుగా తెలంగాణ చౌరస్తా నుంచి శిల్పారామం వరకు పోలీసులతో పాటు మంత్రి బైక్ ర్యాలీ పాల్గొన్నారు. తెలంగాణ చౌరస్తాలో మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్ర పాలనలో తక్కువ మంది పోలీసులు అధిక పనిఒత్తిడితో రోజూ విధులు నిర్వహించేవారని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పోలీసులకు విధుల నిర్వహణలో ఉపశమనం, మెరుగైన సౌకర్యాలు, ఖాళీల భర్తీ, నూతన పోలీస్స్టేషన్లు, అవసరమైన వాహనాలు సమకూర్చి అండగా నిలిచినట్లు పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు హోంగార్డులకు రూ.5వేల వేతనం మాత్రమే ఉండేదని, ప్రస్తుతం రూ.30వేలు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. శాంతిభద్రతల విషయంతోపాటు సీసీ కెమెరాలు, క మాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి దేశంలోనే తెలంగాణ శాంతిభద్రతల పరిరక్షణలో ఆదర్శంగా నిలిచిందని వెల్లడించారు. నార్కోటిక్స్ అండ్ కంట్రోల్ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదని, ఆ స్థాయిలో రూపుదిద్దుకుంటున్నదన్నారు.
మహిళలకు భరోసా..
మహిళలు, బాలికలకు ఎల్లప్పుడు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని శిల్పారామం వద్ద మహిళలు, చిన్నారులకు భద్రతపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. మహాబ్రాండ్ ఏర్పాటు చేసి స్థానిక మహి ళా సంఘాల సభ్యులు ఉత్పత్తి చేసిన వస్తువులను విక్రయించేందుకు అవకాశం కల్పించామని తెలిపారు. షీ టీమ్స్, మహిళా పోలీస్‌స్టేషన్, సఖి కేంద్రాలు మహిళలకు రక్షణగా నిలుస్తున్నాయన్నారు. అంతకుముందు శిల్పారామంలో పోలీస్‌శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి ప్రారంభించారు.
తెలంగాణలో పోలీస్‌శాఖ పటిష్టం : ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైతే నిర్వీర్యం అవుతుందని కొందరు అన్నారని, ప్రస్తుతం వారు కనిపించకుండా పోయారని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తప్పుడు మాటలు మాట్లాడిన వారు తెలంగాణ రాష్ట్రం ప్రగతి చూస్తే నోటమాట రాదన్నారు. గత ప్రభుత్వాలు పనిచేయని కారణంగానే శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమయ్యేవని, తెలంగాణ ప్రభుత్వం పోలీస్‌శాఖను పటిష్టం చేయడమే కాకుండా వారికి తగిన సహకారం అందిస్తుందన్నారు.
దేశంలోనే తెలంగాణ ప్రథమస్థానం : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
దేశంలో మన రాష్ట్రం అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలిచిందని, ఇందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. పో లీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసి దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిపారన్నారు. పోలీసులు ఎంత కష్టాన్నైనా భరించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్నారన్నారు.
ప్రజల చెంతకు పోలీసులు : ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
ప్రజలకు ఎల్లప్పుడూ పోలీసులు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రతిక్షణం ఏం జరుగుతుందో తెలుసుకునే విధంగా అత్యంత అధునాతన క మాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి భద్రత కల్పిస్తున్న రా ష్ట్రం తెలంగాణ అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, కలెక్టర్ జి.రవినాయక్, ఎస్పీ కె.నరసింహ, అదనపు కలెక్టర్ సీతారామారావు, అదనపు ఎస్పీ రాములు, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మూడా చైర్మన్ వెంకటన్న, డీసీసీబీ ఇన్చార్జి అధ్యక్షుడు వెంకటయ్య, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్ పాల్గొన్నారు.